బోరు కొట్టిస్తున్న బిగ్ బాస్…



Want create site? Find Free WordPress Themes and plugins.
అంచనాలు తలకిందులవుతున్నాయి. స్టార్ మాటీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో అప్పుడే బోరు కొట్టిస్తోంది. అందులో పాల్గొన్న సెలబ్రెటీలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నారు. వారికిచ్చే టాస్క్ చాలా సాదా సీదాగా ఉంటోంది. బ్యాగ్ లు తీసుకురావడాన్ని ఆపాలని సమీర్ కు టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఆ పని చేయలేకపోయాడు సమీర్. అందుకే వచ్చే వారం సమీర్ ను ఎలిమినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు మధు ప్రియ ఎప్పుడూ ఏడుస్తూ కనిపిస్తోంది. ఏదో సరదాగా చూద్దామనుకున్న బిగ్ బాస్ లో ఈ ఏడుపు గోల ఏంటిరా బాబాయ్ అంటున్నారు. 
                     మరోవైపు స్టార్ మాటీవీ తెలుగు షోలో అంతా హిందీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. దీంతో అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు. నేను ఊడుస్తాను. తుడుస్తాను అంటూ జ్యోతి, హరి ప్రియ, ముమైత్ పోటీ పడటం ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. అసలు లక్షల రూపాయలు పెట్టి ఈ షో ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదనిపిస్తోంది. ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇరగదీస్తాడు అని అంతా ఊహించారు. కానీ ఆ ఫలితం ఇప్పుడు నాలుగు రోజుల ఫలితాల్లో కనపడలేదు. రాను రాను బాగుంటుందేమే చూడాలి. సంపూ, ధన్ రాజ్ లు ఎక్కువగా నిద్రకే తమ సమయాన్ని కేటాయిస్తున్నారు. ఫలితంగా వారికి పనిష్ మెంట్ ఇచ్చారు. సంపూర్ణేష్ బాబు కు పెద్ద షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ ఇంటి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంపూర్ణేష్ బాబుని ఆ బాధ్యతల నుంచి తప్పించారు. మొత్తంగా ఇదో విఫలమైన ఎపిసోడ్ గా ఇప్పటి వరకు కనపడింది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*