ఘన విజయం సాధించిన రామ్ నాధ్ కోవింద్



Want create site? Find Free WordPress Themes and plugins.
      ముందే తెలిసినా ఫలితం ప్రకటించే వరకు ఆగక తప్పలేదు. రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు రామ్ నాధ్ కోవింద్ కే పట్టం కట్టాయి. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉన్న రామ్‌నాథ్‌ కోవింద్ రాష్ట్రపతిగా గెలిచారు. కౌంటింగ్ లో తొలి నుంచి భారీ ఆధిక్యంలో ఉన్న రామ్‌నాథ్‌ కోవింద్‌ ఘన విజయం సాధించారు. మొత్తం 65.65 శాతం ఓట్లతో కోవింద్ గెలుపొందారు. యూపీఏ కాంగ్రెస్ అభ్యర్థి మీరా కుమార్ కు కేవలం 34.35 శాతం ఓట్లు వచ్చాయి.
      రామ్ నాథ్ కోవింద్ 7, 02, 644 విలువైన ఓట్లను సాధించగా…మీరాకుమార్ 3లక్షల 67, 314 విలువైన ఓట్లతో సరిపెట్టుకున్నారు. మీరా కుమార్ పై విజయం సాధించిన కోవింద్ భారత 14వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతిగా ఎన్నికైన రెండో దళిత వ్యక్తి కోవింద్. వృత్తిరీత్యా న్యాయవాది అయిన కోవింద్ 1994-2006 మధ్య రెండుసార్లు రాజ్యసభకు ఎన్నిక అయ్యారు. కోవింద్ ఎన్నికతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. రామ్ నాథ్ కోవింద్ ఈ నెల 25న రాష్ట్రపతి గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఇక మిగలింది ఉప రాష్ట్రపతి ఎన్నికలే. రామ్ నాద్ కోవింద్ లానే..వెంకయ్య గెలుపు లాంఛనమే అయినా…ఓటంగ్ జరిగి ఫలితాలు ప్రకటించే వరకు ఆగాల్సిందే.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*