రైతు సంఘాలకు నిధులు



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణలో రైతు సంఘం ఏర్పాటు చేయడం మంచి నిర్ణయం. అంతే కాదు..ప్రతి రైతుకు రూ.8 వేల పెట్టుబడి కింద ఇవ్వనుండటం అభినందనీయం. పంటలు వేసింది మొదలు…అమ్మే వరకు రైతు సమాఖ్యలకు ఇందులో పాత్ర కల్పించేలా ఆ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రతి గ్రామంలో రైతు సమన్వయ సమితి ఏర్పాటు చేస్తారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, మహిళా రైతులకు భాగస్వామ్యం కల్పిస్తారు. వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతు ఇందులో సభ్యుడిగా ఉంటారు. మొత్తం 11 మంది సభ్యులతో రైతు సంఘం ఏర్పాటవుతోంది. అలానే ప్రతి మండలం, జిల్లాలో చివరిగా 11 మందితో రాష్ట్ర రైతు సంఘం ఏర్పాటవుతోంది. ఇందు కోసం రూ.500 కోట్లను మూల నిధిగా ఏర్పాటు చేశారు. అవసరమైతే  ప్రభుత్వ గ్యారంటీతో రూ.10 వేల కోట్లను రైతు సంఘం సమకూర్చుకుంటోంది. వినూత్నంగా ఉన్న ఈ ఆలోచన ఇప్పుడు హాట్ టాపికైంది. భూమి అమ్మినా, కొన్నా రైతు సంఘాలకు చెప్పాలి. పాస్ పుస్తకాలు ఇప్పించే బాధ్యత వారిదే. భూమి వివరాలను ఎమ్మార్వో తప్పనిసరిగా రైతు సంఘానికి చెప్పాలి. పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా రైతు సంఘాలు పాత్ర పోషించనుండటం మంచిదే. కానీ అమలు తీరు సక్రమంగా లేకపోతే ఇబ్బంది తప్పదు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*