ఏపీ నేతకు కేంద్ర మంత్రి పదవి



Want create site? Find Free WordPress Themes and plugins.
        కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రాజీనామాతో తెలుగు వారికి అందులోను ఏపీకి చాన్స్ దక్కనుంది. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి పదవి కోసం రాజీనామా చేశారు. త్వరలోనే ఈ రెండు సీట్లు భర్తీ చేయనుంది కేంద్రం. అందులో భాగంగా ఏపీకి చాన్స్ దక్కే వీలుంది. తమకు మరో మంత్రి కేటాయించాలని సి.ఎం చంద్రబాబునాయుడు ఇప్పటికే ప్రధాని మోడీని అడిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజులు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికైనప్పటికీ వెంకయ్యనాయుడును తెలుగువారిగానే పరిగణించి మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు ఆయన రాజీనామాతో బీజేపీలోని ఏపీ నేతలకు చాన్స్ వచ్చే వీలుందంటున్నారు. వీలుంటే కంభం పాటి హరిబాబుకు గానీ..లేక మరో నేతకు గానీ అవకాశం ఇచ్చే వీలుందంటున్నారు. 
         ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఇంత కంటే మంచి అవకాశం రాదనుకుంటున్న కాషాయ దళం ఆ దిశగా చర్యలు మొదలు పెట్టిందంటున్నారు. పైకి చెప్పక పోయినా వెంకయ్యనాయుడు లేని లోటు టీడీపీ పై పడుతోంది. రాజకీయంగా చంద్రబాబు సర్కారుకు అండదండగా ఉంటున్న వెంకయ్యనాయుడు లేకపోతే కాస్తంత ఇబ్బందేఅన్నది నిజం. ఇప్పుడు చంద్రబాబు మాటను ప్రధాని మోడీ పరిగణనలోకి తీసుకుంటారా లేక స్థానిక బీజేపీ నేతల మాటలను పరిగణనలోకి తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*