జగన్ కు బిగ్ షాక్



Want create site? Find Free WordPress Themes and plugins.
       వైసీపీ పార్లమెంటరీ భేటీకి ఎంపీలు హాజరుకాక పోవడం హాట్ టాపికైంది. కర్నూలు ఎంపీ బుట్టా రేణుకా ఏపీ మంత్రి నారా లోకేష్ తో మాట్లాడారు. అందుకే జగన్ తో భేటీకి ఆమె దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఇవాళ రాలేదు. నిన్న లోకేష్ ను కలిసింది. ఇలా అయితే ఎలా పార్టీని నడపాలని ఎంపీలను అడిగారట జగన్. వ్యాపారాలు చేసుకోవద్దని అన్నందుకే వారు ఇలా పార్టీ వీడితే ఎలా అని ప్రశ్నించారట. అదే సమయంలో ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేయాలనే అంశం చర్చకు వచ్చింది. కానీ ఎంపీలు ఎవరు రాజీనామా చేసేందుకు సిద్దంగా లేమని చెప్పారట. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచాం. ఇప్పుడు రాజీనామాలు చేస్తే ఆర్థికంగా నష్టపోతాం. అదే సమయంలో తిరిగి గెలుస్తామనే నమ్మకం లేదు. అందుకే రాజీనామాలు తప్ప ఇంకేమైనా అంశం చెప్పాలని ఎంపీలు చెప్పారట. దీంతో జగన్ సమావేశం మధ్య నుంచే బయటకు వెళ్లి పోయినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమితో పాటు..నేతలు తిరిగి టీడీపీకి గూటికి వెళ్లేందుకు సిద్దం కావడం జగన్ లో అసహనాన్ని పెంచుతుందట. అందుకే అలా మీటింగ్ మధ్యలోనే వెళ్లిపోయారని తెలుస్తోంది. 
       పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించాల్సిన  ఎంపీలు ఆ సంగతి మర్చిపోయి..ఎన్నికల్లో డబ్బుల గురించి…పోటీ గురించి మాట్లాడుకుని వెళ్లారని తెలుస్తోంది. అదీ వైసీపీ ఎత్తుగడ. ప్రజా సమస్యలు ఏమున్నాయి. మన వల్ల వారికి ఒరిగే ప్రయోజనాలు ఏంటనే విషయం పై చర్చించుకుని అవసరమైతే బీజేపీని ఎదిరించి ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చే అంశాన్ని ప్రస్తావించాల్సి ఉంది. కానీ అవేం మీటింగ్ లో మాట్లాడలేదంటున్నారు. 
        హోదా పై గట్టిగా మాట్లాడలేకపోతున్న జగన్ కు ఆ మేరకు ఏపీ ప్రజల నుంచి గట్టి వ్యతిరేకత ఏర్పడుతోంది. నంద్యాల ఉప ఎన్నికల్లోను అది ప్రభావం చూపే అవకాశముంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*