గడీల పాలన -తాకట్టు లో తెలంగాణ 



Want create site? Find Free WordPress Themes and plugins.
లండన్ లో  పీపుల్స్ ఛార్జ్ షీట్  – పుస్తక ఆవిష్కరణ
        ఈ రోజు లండన్ లో తెలంగాణ  ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై విభాగం  ఆధ్వర్యం లో   టీపీసీసీ   తయారుచేసిన  పీపుల్స్ ఛార్జ్ షీట్  – పుస్తక ఆవిష్కరణ  జరిగింది .  ఆవిష్కరణ కార్యక్రమానికి టీపీసీసీ  ప్రధాన కార్యదర్శి  దాసోజు శ్రవణ్  ముఖ్యఅతిథి గా పాల్గొని ఆవిష్కరించారు . తెరాస 3 ఏండ్ల  రాచరిక పాలనలో ప్రజల అవస్థలు, తప్పిన ఎన్నికల వాగ్ధానాలు, నిరంకుశ, అప్రజాస్వామిక, ప్రజా వ్యతిరేక విధానాల పై, వివిధ రంగాల్లో  అడ్డగోలు వ్యవహారాల పై తయారుచేసిన   ”గడీల పాలన -తాకట్టు లో తెలంగాణ”  పుస్తక ఆవిష్కరణ చేసారు . 
       దాసోజు శ్రవణ్  మాట్లాడుతూ  అమరుల  బలిదానాల సాక్షి గా తెచ్చుకున్న తెలంగాణలో రాచరిక పాలన ను తలపిస్తుందని, ఒంటెద్దు పోకడలు ఎన్ని రోజులు అని, ఓట్లు సీట్లు ఆలోచన లేకుండా ప్రజల కోసం పనిచేయాలని ముఖ్యమంత్రి  కి సూచించారు . 
       కార్యక్రమం లో  అడ్వైసరి మెంబర్లు డోకుర్ పవన్ కుమార్ ,ఓరుగంటి కమలాకర్ రావు, యూకే కన్వీనర్ గంప వేణుగోపాల్  తదితరులు ప్రసంగించి   ప్రభుత్వ పని తీరు పై ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమం లో కో కన్వీనర్లు రంగుల సుధాకర్ గౌడ్ ,రామ్మోహన్ రెడ్డి ,రాకేష్ బిక్కుమండ్ల ,అచ్యుత రెడ్డి  సభ్యులు ,సత్య ప్రకాష్ , రాజేశ్వేర్ రెడ్డి , దేవులపల్లి శ్రీనివాస్ ,మధు గట్ట ,తదితరుల ఆధ్వర్యం లో సుమారు 100 మంది పుస్తకావిష్కరణ కి మద్దతు తెలిపారు .
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*