పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ అడిగిన ప్రశాంత్ కిషోర్



Want create site? Find Free WordPress Themes and plugins.
ఏపీలో వైసీపీ, తమిళనాడులో డిఎంకే కూటమిని గెలిపించేందుకు రంగంలోకి దిగాడు ప్రశాంత్ కిషోర్. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ అడిగారు. ఇందుకు వారి వైపు నుంచి ఇంకా సంకేతాలు రావాల్సి ఉంది. వైసీపీతో జనసేన, కమ్యూనిస్టులను కలిపేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు జగన్ పార్టీ ఎన్నికల సలహాదారు ప్రశాంత్ కిషోర్. 
                   2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని పవన్ కల్యాణ్ ఆలోచిస్తున్నాడు. అందుకే ముందుగా పవన్ ను కలిసి ఆయన అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు పీకే ప్రయత్నిస్తాడట. అతని నుంచి వచ్చే రెస్పాన్స్ ను బట్టి తన స్టెప్ వేయనున్నాడు ప్రశాంత్ కిషోర్. మీరు టైమ్ ఇస్తే నేను కలుస్తాను. మీరిచ్చే సమాధానంతో మా పార్టీ అధినేత జగన్ కలిసేందుకు సిద్దంగా ఉన్నట్లు చెబుతున్నాడు పీకే. ఈ మేరకు ఒక లేఖను పవన్ కల్యాణ్ కార్యాలయానికి పంపారు ప్రశాంత్ కిషోర్. 

 

                   పవన్ కల్యాణ్ అందుబాటులో లేరు. సినిమా షూటింగ్ కోసం మరో ప్రాంతానికి వెళ్లారు. ఆయనకు మీ సమాచారం చేరవేస్తాం. వారిచ్చే సమాధానాన్ని బట్టి మీకు సమాచారం ఇస్తామని ప్రశాంత్ కిషోర్ కు చెప్పారట జనసేన పార్టీ కార్యాలయ నేతలు. దీంతో ఇప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకుంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*