జగన్ పై నిప్పులు చెరుగుతున్న రాజధాని రైతులు



Want create site? Find Free WordPress Themes and plugins.
       వైసీపీ అధినేత జగన్‌పై మండిపడుతున్నారు అమరావతి ప్రాంత రైతులు. తమ ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. తమకు భూముల కేటాయింపుకు వ్యతిరేకంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ కోర్టుకు వెళ్లడమే ఇందుకు కారణం. అందుకే జగన్ తోపాటు..ఆర్కే దిష్టి బొమ్మల దగ్ధం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మించేందుకు సి.ఎం చంద్రబాబునాయుడు సర్కారు పావులు కదుపుతోంది. కానీ వైసీపీ దీనికి అడ్డుపడే వ్యూహంతో వెళుతుంది. తాజాగా గుంటూరులో నిర్వహించిన వైసీపీ ప్లీనరీలోను ఆ పార్టీ నేతలు రాజధానికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారనే చర్చ జరిగింది. అసలు అమరావతి నుంచి ప్రకాశం-కర్నూలు జిల్లాల మధ్యకు రాజధానిని మారుస్తారనే చర్చ జరుగుతోంది. 
      సీఎం చంద్రబాబుపై నమ్మకంతో 33, 567 ఎకరాలను స్వచ్ఛందంగా భూ సమీకరణ కింద ఇచ్చారు రైతులు. అద్భుత రాజధాని నిర్మాణానికి సహకరిస్తున్నారు. భూ సమీకరణకు సహకరించిన వారికి సీఆర్డీఏ అధికారులు ప్లాట్లను కేటాయిస్తున్నారు. సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి, పోలీస్ హెడ్ క్వార్టర్లు వచ్చాయి. వచ్చే నెలలో సీడ్ కేపిటల్ నిర్మాణం పనులు మొదలు కాబోతోంది. ఇలాంటి సమయంలో ల్యాండ్ పూలింగ్‌లో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ జగన్‌తో పాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్లీనరీ వేదికగా చేసిన ఆరోపణలు వారిని ఆందోళనకు గురి చేస్తోంది. అసలు రాజధాని భూ సేకరణలు అక్రమాలకు తావు ఎక్కడ ఉందా చెప్పాలని సవాల్ విసిరారు రైతులు. ఎవరికి వారే రైతులు భూములు ఇచ్చారు. వారికి పరిహారం వచ్చింది. అనసరంగా వైసీపీ నేతలు కొత్త వివాదాన్ని రేపుతున్నారని నిప్పులు చెరుగుతున్నారు. ఏదన్నా ఉంటే మీరు మీరు చూసుకోండి. రాజకీయాలు చేసుకోండి. అంతేగానీ రాజధాని రైతుల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు వాళ్లు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*