తల్లి కాంగ్రెస్, పిల్లకాంగ్రెస్ లు కలిసే ఆలోచనేలేదు



Want create site? Find Free WordPress Themes and plugins.
ఆంధ్రప్రదేశ్ లో విచిత్రమైన రాజకీయాలు సాధారణ విషయమే. ఎక్కడా లేని రాజకీయాలు ఇక్కడ జరగుుతుండటం కొత్తేం కాదు. తల్లికాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ లు రెండు విలీనం అవుతాయనే ప్రచారం చేస్తున్నారు కొందరు తెలుగు తమ్ముళ్లు. కానీ అది వాస్తవం కాదు. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ లు అలా కలవలేదు. అలా కలిస్తే నిండా మునిగిన కాంగ్రెస్ కు లాభమే. కానీ జగన్ పార్టీకి మైనస్. 
                                 రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాధ్ కోవింద్ ను ప్రకటించక ముందే బీజేపీ వారికి మద్దతు పలికాడు జగన్. ముందుగానే దాసోహమయ్యాడు. అంతే కాదు.. హైదరాబాద్ కు రామ్ నాధ్ కోవింద్ వచ్చినప్పుడు పాదాభివందనం చేశాడు జగన్. జగన్ తత్వం తెలిసిన వారెవరు అసలు ఆపని చేసింది జగనేనా అని ముక్కున వేలేసుకున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదురా.. ఎక్కడ తగ్గి ఉండాలో తెలిసిన వాడే నేత అని సంగతిని గుర్తు చేసుకుంటున్నారు. బీజేపీని కాదని.. జగన్ ఏ పని చేయలేరు. అంతెందుకు వైసీపీ ప్లీనరీలో ఒక్క మాట బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు జగన్. అసలు ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ఆందోళనలు చేసింది. చేయించింది జగన్. ఇప్పుడు ఆ సంగతి అసలు ప్రస్తావించడంలేదు. అలా మాట్లాడితే ప్రధాని మోడీతో పాటు మిగతా వారి నుంచి వ్యతిరేకత వస్తోంది.ఆ వ్యతిరేకత రేపు అక్రమాస్తుల కేసులో చిక్కులు తెచ్చి పెడుతోంది. అందుకే జగన్ వారిని ఒక్క మాట అనలేడు. 
                                కాబట్టి కాంగ్రెస్ లో వైసీపీని విలీనం చేయడం కల్లా. కావాలంటే లోపాయికారిగా ఇరు పార్టీల నేతలు మాట్లాడుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎలాగు అలానే సాగుతోంది. వైసీపీలో చేరే ముందు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి కాంగ్రెస్ నేత కేవీపీ ఇంటికి వెళ్లి మరీ విందు రాజకీయంచేశారు. ఆ తర్వాత విజయవాడ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముందుగా అటు ఉండవల్లి, ఇటు కేవీపీతో మాట్లాడకనే వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది. అందుకే బయటకు తెలియకుండా ఒకరికి మరొకరు సహకరించుకోవడం తప్ప కలిసే ప్రసక్తే లేదంటున్నారు.  
 
 
 
 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*