నాగార్జున ఆ పార్టీలో చేరరట



Want create site? Find Free WordPress Themes and plugins.
     ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున వైస్ఆర్ కాంగ్రెస్ లో చేరాతారనే ప్రచారానికి పుల్ స్టాప్ పడింది. ఆ ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పారు అక్కినేని కోడలు అమల. అమరావతి కేంద్రంగా ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని నాగ్ విస్తరించుకుంటున్నారని వస్తున్న వార్తలను ఖండించారు ఆయన సతీమణి అమల. ఏ పార్టీలోను నాగార్జున చేరే ఆలోచన లేదని చెప్పారామె. ఒకవేళ తాము పార్టీలో చేరదలచుకుంటే కచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ముందుగానే మీడియాకు చెబుతామన్నారు. దీంతో నాగార్జున చేరిక పై నెలకున్న అనుమానాలకు సమాధానం వచ్చినట్లైయింది. 
      నాగార్జున వైసీపీ అధినేత జగన్ లు కలిసి పోతున్నారని..ఇంకేముంది చేరడమే ఆలస్యమనేంత వరకు ప్రచారం వెళ్లింది. ప్రచారం పీక్ స్టేజ్ కు వెళ్లడంతో ఇక ఖండన ఇవ్వక తప్పలేదు అమలకు. అందుకే ఆమె ఈ ప్రచారానికి చాలా సింపుల్ గా తెరదించారు. తన సినిమాలు, వ్యాపారాలు, కుటుంబ పనులతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి లేని పోని ఇబ్బందులు పడదల్చుకోలేదని చెప్పారు అమల. నాగార్జునకు అన్ని పార్టీల నేతలతో సంబంధాలు ఉన్నాయి. ఒక పార్టీలో చేరితే మరో పార్టీ నేతలు దూరం అయ్యే అవకాశముంది. అందుకే ఎటువైపు మొగ్గకుండా తన పని తాను చేసుకుపోయేందుకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నేతలు ఆయన్ను చేర్చుకునేందుకు ప్రయత్నించినా..కాదని చెప్పినట్లు సమాచారం వస్తోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*