జగన్ పాదయాత్ర చేస్తాడంటారా…



Want create site? Find Free WordPress Themes and plugins.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేసేందుకు చాలా ప్రయత్నాలే చేశాడు. ఆయన అలా పాదయాత్ర అని పేరు చెప్పడం పోలీసులు అరెస్టు చేయడం షరామాములుగా జరుగుతోంది. దీంతో ఇంట్లో నుంచే దీక్షల పేరుతో జనాలను తమ వైపుకు తిప్పుకునే వ్యూహంతో వెళుతున్నాడాయన. ఇప్పుడు కిర్లంపూడి నుంచి అమరావతికి పాదయాత్ర చేసేందుకు ఆయన సిద్దమవుతున్నా ఏపీ సర్కారు అనుమతించలేదు. 
                   మరోవైపు విపక్ష నేత జగన్ సైతం పాదయాత్ర చేసేందుకు సిద్దమయ్యాడు. ఇందుకు ప్రభుత్వం వైపు నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అదే జరిగితే అంత తేలికగా అనుమతులు ఇచ్చే అవకాశం లేదంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో శాంతి భద్రతల పేరుతో పాదయాత్రలకు అనుమతులు రావంటున్నారు. గతంలో దివంగత సి.ఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి, ఇప్పటి సి.ఎం చంద్రబాబునాయుడులు పాదయాత్రలు చేసిన తర్వాత కలిసొచ్చింది. వైఎస్ తొలిసారి సి.ఎం కాగా.. చంద్రబాబు మూడోసారి సి.ఎం పీఠం ఎక్కారు. అందుకే ఇప్పుడు జగన్ అదే బాట పట్టాలని ఆలోచిస్తున్నారు. తమ పార్టీ ఎన్నికల సలహాదారు ప్రశాంత్ కిషోర్ సూచనతోనే జగన్ ఈ పని చేయనున్నట్లు తెలుస్తోంది.
             ప్రజల్లోకి వెళితేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందని.. హైదరాబాద్ లో కూర్చుంటే ఇప్పుడే కాదు.. 2024లోను సి.ఎం కాలేవని జగన్ కు చెప్పారట పికే. అందుకే జగన్ ఎన్ని ఇబ్బందులు వచ్చినా పాదయాత్ర చేయాలనుకుంటున్నారు. ప్రభుత్వం అనుమతులు ఇవ్వక పోయినా పాదయాత్ర చేసేందుకే మొగ్గు చూపుతారట.
              తెలుగు రాష్ట్రాల్లో చేసిన సర్వేలు అన్నీ జగన్ కు వ్యతిరేకంగా వచ్చాయి. విపక్ష నేతగా జగన్ తన పాత్రను మరింత పెంచాలని సర్వేలుచెబుతున్నాయి. అదే సమయంలో జనసేన పవన్ కల్యాణ్ తెరపైకి వచ్చినా..అంత ప్రభావం చూపే పరిస్థితి కనపడంలేదు. మొత్తంగా టీడీపీ దరిదాపుల్లోకి వైసీపీనే కాదు..మరో పార్టీ రాలేదని సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఆ పరిస్థితిని కొంతైనా మార్చేందుకు జగన్ పాదయాత్ర చేస్తాడంటున్నారు. ప్లీనరీలోనే పాదయాత్రపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. పాదయాత్ర ఎప్పుడు చేస్తారు.. ఎక్కడ నుంచి మొదలవుతుంది. ఎన్ని రోజులు అనే రూట్ మ్యాప్ ను ప్రకటించనున్నారు.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*