జగన్, విజయసాయిరెడ్డి పై సిబిఐ కోర్టు ఆగ్రహం 



Want create site? Find Free WordPress Themes and plugins.
    ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్‌, విజయసాయిరెడ్డి గైర్హాజరుపై సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరులో ఈనెల 8,9తేదీల్లో పార్టీ ప్లీనరీ సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకే తమను హాజరునుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్‌ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ మేరకు పిటిషన్‌పై కోర్టు ముందుంచారు. ఆ పిటిషన్ ను పరిశీలించిన సిబిఐ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయ కారణాలతో కోర్టుకు గైర్హాజరు కావడం సరికాదని చెప్పింది. ఇప్పుడే కాదు..రానున్న కాలంలో ఇలాంటి కారణాలు చెప్పి కోర్టుకు హాజరుకాకపోతే వారెంటు జారీ చేయాల్సి ఉంటుందని ఘాటుగా హెచ్చరించింది. అదే సమయంలో కేసు విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
     మరోసారి కోర్టుకు రాకపోతే జగన్ కు చిక్కులు తప్పేలా లేవు. ఇంకోవైపు క్రిడ్ ప్రోకో కేసులో జగన్ కు సమన్లు జారీ అయిన సంగతి తెలిసిందే. జగన్ తో పాటు..విజయసాయిరెడ్డికి సమన్లు అందాయి. ఆగస్టులో ఆ కేసు విచారణ జరగనుంది. జ‌గ‌న్‌కు చెందిన కంపెనీల‌కు ఇండియా సిమెంట్స్ నుంచి రూ. 140 కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీబీఐ గుర్తించింది. అందుకే ఇది క్విడ్ ప్రోకో కిందకు వస్తుందని భావించి సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ పెట్టుబడుల కోసం ఇండియా సిమెంట్స్ కు కడప జిల్లాలో భూమితో పాటుగా కృష్ణా నది నీటిని కేటాయించిన వైనాన్ని సీబీఐ తన దర్యాప్తులో తేల్చింది. ఈకేసులో విచారణ కోసం ఆగస్టు 4వ తేదీన జగన్ తోపాటు విజయసాయి రెడ్డి, శ్రీనివాసన్ లు కూడా సీబీఐ కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది. క్విడ్ ప్రోకో ఎందుకు చేయాల్సి వచ్చింది..వాస్తవం ఏంటనే వైనం పై విచారణ చేయనుంది
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*