నిన్ను కోరి మూవీ రివ్యూWant create site? Find Free WordPress Themes and plugins.
సినిమా పేరు:  నిన్నుకోరి
న‌టీన‌టులు:   నాని, నివేదా థామ‌స్‌, ముర‌ళీశ‌ర్మ‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పృథ్వీ త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ:కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని
సంగీతం:      గోపీ సుంద‌ర్‌
నిర్మాత‌:        డీవీవీ.దాన‌య్య‌
స్క్రీన్‌ప్లే:         కోన వెంక‌ట్‌
ద‌ర్శ‌క‌త్వం:    శివ నిర్వాణ‌
పరిచయం….వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నేచుర‌ల్ స్టార్ నాని. ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం నుంచి నేను లోక‌ల్‌ వ‌ర‌కు హిట్ల‌ మీద హిట్లు కొడుతున్నాడు. నేను లోక‌ల్ సినిమాతో తనస్థాయిని రూ. 30 కోట్ల క్ల‌బ్‌కు చేర్చాడు నాని. ఈ మూవీలో నానికి జంటగా…హీరోయిన్ నివేద థామ‌స్‌ నటించడం ప్లస్ పాయింట్ కాగా..హీరో ఆది పినిశెట్టి ఈ మూవీలో కీలక పాత్ర పోషించడం విశేషం. శివ నిర్వాణ దర్శ‌క‌త్వం వ‌హించ‌గా, డీవీవీ దాన‌య్య నిర్మాతగా వ్యవహరించి మూవీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. 
ప్రేమ కథే అయినా కొత్త తరహాలో రాసుకుని చూపించాడు శివ నిర్వాణ. ఫస్టాప్ నెమ్మదిగా సాగినట్లు అనిపించినా..సెకండాప్ బాగుంది. చివర పదినిమిషాలు అందరినీ ఆలోచింపజేస్తోంది. అంతలా ఆకట్టుకున్నాడు దర్శకుడు. నాని నటన అదుర్స్..మొత్తంగా సినిమాను చూడవచ్చనే ఆలోచన వస్తుంది చూసిన ప్రేక్షకులకు. అందుకే ఒక్కసారిగా కథను తెలుసుకుందాం…
కథ ఏంటంటే…
చదువు, ఉద్యోగం వంటి కెరీర్ కు ఇంపార్టెన్స్ ఇచ్చే కారెక్టర్ నానిది. వైజాగ్ లో పిహెచ్ డి చేసేందుకు వెళతాడు ఉమా మహేశ్వరరావు ( నాని), అక్కడే పల్లవి ( నివేదా ధామస్) ఉమాకు పరిచయం అవుతోంది. క్రమంగా అది ప్రేమగా మారుతోంది. కానీ ఉమ తను జీవితంలో స్థిరపడ్డాకనే పెళ్లి మిగతా విషయాలు అనుకుంటాడు. కానీ పల్లవి మాత్రం అలా ఉండదు. ఎలా అయినా ఉమాతో కలిసి వెళ్లి పోవాలని..పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తోంది. ఇదే సమయంలో తన కెరీర్ కోసం హస్తినకు వెళతాడు ఉమ. 
ఈ విషయాలు ఏవి తెలియని హీరోయిన్ తల్లిదండ్రులు ఆమెకు సంబంధాలు చూస్తారు. చివరకు పల్లవికి అరుణ్ (ఆది పినిశెట్టి) తో వివాహం జరిపిస్తారు. పల్లవి ఉమా అనే వ్యక్తిని ప్రేమిస్తుందని..పెళ్లి చేసుకోవాలనుకుంటుందని వారికి తెలియదు. మరోవైపు పల్లవి వారికి చెప్పదు. ప్రేమించిన వాడిని వదులుకోలేక, అలాయని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న భర్తతో కాపురం చేయలేక పల్లవి తల్లడిల్లుతోంది. చివరకు వారిద్దరు ఏం చేస్తారు..ఉమాను పల్లవి చేసుకుంటుందా..అరుణ్ తో కాపురం చేస్తుందా..చివరకు వారి జీవితం ఎలా ముగిసిందనేదే సినిమా కథ. 
తన ప్రేమను గెలిపించుకునేందుకు ఉమా..నివేదితా దగ్గరకు వెళ్లడం, ఆదిని ఒప్పించి పది రోజుల పాటు ఉండటం, ఆది-నివేదితాకు గొడవ కావడం వంటి విషయాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. 
ప్రేమికులు, కుటుంబాలు, బంధాలు, బాంధవ్యాలు, ఆలు మొగల మధ్య ఉండే సున్నితమైన అంశాలను చాలా చక్కగా చెప్పారు దర్శకుడు శివ నిర్వాణ. పాత సినిమాలు అన్నింటిలో భర్తనో భార్యనో లేక ప్రియుడునో ఒకరు త్యాగం చేసే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ అలాంటిది కాకుండా కొత్త తరహాలో కథ చెప్పాడు దర్శకుడు. ఆ పాయింట్ కాస్తంత ఆసక్తిని పెంచుతోంది.అందుకే చివరి పదినిమిషాలు చాలా బాగుంటుంది. సహజ నటుడు నాని మరోసారి తన పాత్రలో జీవించాడు. ఎమోష‌న‌ల్, కామెడీ టైమింగ్‌లోను పంచ్ లు పేల్చాడు. జెంటిల్‌మ‌న్‌లో తనతో నటించిన హీరోయిన్ కావడంతో నాని నివేదాతో పెద్దగా ఇబ్బంది పడలేదు. ఇద్దరి మధ్య సీన్స్ బాగానే పండాయి.  
ఇటు భర్త, అటు ప్రియుడు మధ్య నలిగిపోయే పాత్ర నివేదితా మంచి నటననే కనపర్చింది. నివేదితా భ‌ర్త‌గా న‌టించిన ఆది పినిశెట్టి ఇరగదీశాడు. మొత్తంగా నామి,నివేదితా, అది ఎవరికి వారే తమ పాత్రలకు న్యాయం చేశారు. నివేదితా తండ్రిగా చేసిన ముర‌ళీశ‌ర్మ‌, అత‌డి అల్లుడిగా చేసిన పృథ్వీ క్యారెక్ట‌ర్లు బాగానే ఉన్నాయి. 
సాంకేతికంగా…
కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. అమెరికా లొకేష‌న్ల‌ను అందంగా చూపించిన తీరు ఆకట్టుకుంటోంది. విజువల్స్ మంచి రిచ్ లుక్ తీసుకువచ్చాయి. గోపీ సుంద‌ర్ సంగీతం బాగానే ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇప్పటి తరానికి తగ్గట్లు కథలో దర్శకుడు మార్పులు చేర్పులు చేసుకోవడం ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. కొన్ని సీన్స్ నెమ్మదిగా ఉన్నాయనిపిస్తోంది. 
ప్ల‌స్ పాయింట్స్ 
నేచురల్ స్టార్ నటన
నివేద థామ‌స్, ఆదిల ఎమోషన్స్ 
బాగున్న సంగీతం, సినిమాటోగ్ర‌ఫీ 
అందమైన లోకేషన్లు 
ఖర్చుకు వెనక్కు తగ్గకుండా చూడటం
మైన‌స్ పాయింట్స్ 
ఏ సెంటర్లను దృష్టిలో పెట్టుకుని సీన్స్ తీయడం
మాస్ కు ఎక్కని కథనం
ఫస్టాప్ వీక్
నెమ్మదిగా సాగిన కథ
మొత్తంగా లవ్, కామెడీ, ఎమోషన్ సీన్స్ కోసం చూడవచ్చు. నిర్మాతకు నష్టం మాత్రం రాదు..
రేటింగ్…2.75/5
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*