హెరిటేజ్ వ్యాన్ లో స్మగ్లింగ్ నిజాలు…



Want create site? Find Free WordPress Themes and plugins.
హెరిటేజ్ వ్యాన్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ అయింది. చిత్తూరు జిల్లా పోలీసులు ఈ వ్యాన్ ను పట్టుకున్నారు. ఇంత కంటే మంచి అవకాశం రాదనుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. అంతే. ప్రెస్ మీట్ పెట్టి మరీ దుమ్ము దులిపారు. సి.ఎం చంద్రబాబునాయుడు కుటుంబం పై విమర్శల బాణం ఎక్కువ పెట్టారు. కానీ అసలు విషయం ఏంటంటే..అసలు ఆ పాల వ్యాన్ కు హెరిటేజ్ ప్రొడక్టుకు గానీ…చంద్రబాబుకు గానీ సంబందం లేదు. హెరిటేజ్ ఉత్తత్పులను తీసుకుపోయేందుకు వ్యాన్ లు ఉంటాయి. అది ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉంటాయి. కాకపోతే దాని పై హెరిటేజ్ అని రాసి ఉంది. అంత మాత్రానికే అది హెరిటేజ్ అని..చంద్రబాబుతో సంబంధాలు ఉన్నాయని..టీడీపీ నేతలు అక్రమంగా సంపాదిస్తున్నారని విమర్శలు చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. హెరిటేజ్ పాల వ్యాన్ లో ఎర్రచందనం సరఫరా అవుతుంది వాస్తవమే అయినా…దాన్ని తరలిస్తుంది అక్రమార్కులు. నిజంగా టీడీపీ సర్కారు, టీడీపీ పెద్దలు అక్రమంగా తరలిస్తుంటే..పోలీసులు పట్టుకునేలా ఎందుకు తీసుకెళతారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ వ్యాన్ ను సరిహద్దులు దాటించడం పెద్ద పనేం కాదు. కాకపోతే టీడీపీ అధినేత అలా చేసే వారు కాదు. చేయనివ్వడు అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అంతే గానీ ఏదో ఒకరు హెరిటేజ్ పాల వ్యాన్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నంత మాత్రాన దాన్ని సి.ఎం చంద్రబాబుకు ఆపాదించడం మంచి పద్దతి కాదని హితవు పలుకుతున్నారు. అక్రమార్కులు తమ పనికి అడ్డం వస్తున్నారనే కారణంతో ఏకంగా టాస్క్ పోర్స్ పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపారు. అసలు హెరిటేజ్ వాహనం ఆ సంస్థకు చెందినది కాదని పోలీసులు ప్రాధమికంగానే చెప్పారు. కానీ వైసీపీకి ఇవేం పట్టడం లేదు. విమర్శ చేయాలి కాబట్టి చేయాలన్నట్లుగా గుడ్డ కాల్చి అలా చంద్రబాబు నెత్తిన వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సూర్యుడి నెత్తిన ఉమ్మి వేస్తే అది మీ ముఖానే పడుతుంది…దాన్ని గమనించాలంటున్నారు మరోవైపు తెలుగు తమ్ముళ్లు. అసలు విషయం ఏంటంటే..హెరిటేజ్ వ్యాన్ పేరుతో అక్రమాలు చేస్తున్న వ్యక్తులు ఎవరైనా..ఏ పార్టీ వారైనా వెంటనే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు పోలీసులను ఆదేశించారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*