ఎన్టీఆర్ ను అవతార పురుషుడిగా భావిస్తారన్న రామ్ నాధ్ కోవింద్VIJAYAWADA, JULY 4 (UNI):- NDA Presidential candidate Ramnath Kovind being received by TDP National President and Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu TDP State President K Venkata Rao meeting with MP’s and MLA’ also seen Union Minister M Venkaiah Naidu in Vijayawada on Tuesday. UNI PHOTO-125u
Want create site? Find Free WordPress Themes and plugins.
హైదరాబాద్ పర్యటన తర్వాత బెజవాడ చేరుకున్న ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాధ్ కోవింద్ కు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.  విజయవాడ ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో తెదేపాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ గుర్తు చేశారు రామ్ నాధ్. తెలుగు వారంతా ఆయన్ను అవతార పురుషుడిగా భావిస్తారని విన్నాను. అంతగా ఆరాధించే తెలుగు వారంటే తనకు గౌరవమన్నారు రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగమే భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌ అని కోవింద్ చెప్పారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని..అన్ని పార్టీలు మద్దతునిస్తున్న సంగతిని గుర్తు చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తనకు మద్దతు ఇచ్చిన ఎన్డీయే, నరేంద్ర మోదీ, అన్ని రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ తెలుగు జాతికి గర్వకారణమని కొనియాడారు రామ్ నాద్. మరోవైపు సి.ఎం చంద్రబాబునాయుడు ఆయన తీరును మెచ్చుకున్నారు. రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఓటువేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ అన్ని విధాల సహకరిస్తున్నట్లు చెప్పారు చంద్రబాబు. బెజవాడను చూసిన రామ్ నాధ్ పులకించి పోయారు. ఇంద్రకీలాద్రి పర్వతం అంటే ఏంటి..కృష్ణానది ప్రాశస్తత గురించి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*