చంద్రబాబును ఇబ్బందిపెడుతున్న టీడీపీ నేతలు



Want create site? Find Free WordPress Themes and plugins.
మొన్న విజయవాడ ఎంపీ కేశినేని, నిన్న జేసీ దివాకర్ రెడ్డి, నేడు మంత్రి జవహర్ లు తమ మాటలు, చేతలు, వ్యవహార శైలిలో టీడీపీని ఇరుకున పెడుతున్నారు. చివరకు టీడీపీ పరువు బజారున పడేలా చేస్తున్నారు. కొందరు నేతలు తెలిసి చేస్తుంటే..ఇంకొంత మంది తెలియక..అమాయకంగా బుక్ అవుతున్నారు. అది టీడీపీకి ఇబ్బంది తెచ్చిపెడుతోంది. నవ్యాంధ్రప్రదేశ్ ను తీర్చి దిద్దే పనిలో విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారు చంద్రబాబు. అదే సమయంలో తాను పని చేస్తూ మిగతా వారు పని చేయాలని కోరుతున్నారు. ఈ వయసులో మనవుడితోను కనీసం ఆడుకోకుండా.. ఆయన శ్రమిస్తున్న తీరు మిగతావారిలోను స్పూర్తి నింపుతోంది. అదే సమయంలో కొందరు నేతల తీరు చంద్రబాబునే కాదు..పార్టీని ఇబ్బంది పెడుతోంది. బీరు హెల్త్ డ్రింక్ అని చెప్పారు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్. లైట్ బీరులో 5శాతం, స్ట్రాంగ్ బీర్ లో 8శాతం ఆల్కహాల్ వుంటుంది. బీరు తాగితే  బెల్లీ ఫాట్ పెరుగుతుంది. షుగర్ లెవల్స్ పెరుగుతాయి. ఆరోగ్యం దెబ్బతింటోంది. బీర్ తాగితే ఆరోగ్యం దెబ్బతింటోంది. మద్యం ఆరోగ్యానికి హానికరమని రాసి ఉంటోంది. కానీ మంత్రి జవహర్ ఎరక్క పోయి ఇరుక్కున్నారు. టీవీ-9 లైవ్ లో అదే విషయాన్ని సమర్థించుకునే పని చేశారు. బికామ్ లో ఫిజిక్స్ చేశానని వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన జలీల్ ఖాన్ వాదించినట్లు ఉంటోంది జవహర్ తీరు. ప్రజల ముందు మాట్లాడేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. నియోజకవర్గంలో జవహర్ పనితీరు బాగుంటుంది. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారు. తాను ఎప్పుడూ ఎమ్మెల్యే అని ఆలోచించకుండా ప్రజల కోసం పాటు పడతాడు. కానీ మాట్లాడేప్పుడు కాస్తంత టంగ్ స్లిప్ అయి దాన్ని సమర్థించుకునే పని చేయడం మరింత చిక్కులోకి నెట్టంది. బీరు హెల్త్ డ్రింక్  ఎలా అవుతుందని జవహర్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు జనాలు. అసలు బీర్ బాటిల్ పై ఆరోగ్యానికి హానికరం అని ఎందుకు ముద్రించి ఉంటుందన్న సంగతి మంత్రికి తెలుసా అని ఎద్దేవా చేస్తున్నారు. కేశినేని నాని..ట్రాన్స్ పోర్టు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జేసీ సోదరులు, కుటుంబ సభ్యులు తమ తీరుతో టీడీపీకి చిక్కులు తెచ్చిపెడుతున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. ఆయన అల్లుడు దీపక్ రెడ్డి పార్టీ నుంచి సస్పెడ్ అయ్యారు. జేసీ దివాకర్ రెడ్డి తన వ్యవహారశైలితో ఇబ్బంది తెచ్చుకున్నాడు. వైజాగ్ లో ఎయిర్ పోర్టు సిబ్బంది పై దురుసుగా వ్యవహరించారు. ఇప్పటికైనా చంద్రబాబు తీరును పరిశీలించి వారు పద్దతి మార్చుకోవాలంటున్నారు. లేకపోతే టీడీపీలోనే కాదు..ప్రజల దృష్టిలోను పలచన అవుతారనేది వాస్తవం. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*