ఫిరాయింపుల పై మాట్లాడకండన్న బాబు



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై మాట్లాడారు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ. టీఆర్ఎస్ అధినేత, సి.ఎం కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి ఈపని చేశారన్నారు. అందుకే పార్టీ మారిన వారితో రాజీనామాలు చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారాయన. ఇది టీడీపీని ఇరకాటంలో పెట్టే ప్రకటన. ఎందుకంటే తెలంగాణలో వరకు బాగానే ఉంటోంది. టీడీపీ తెలంగాణకు సంబంధించిన పార్టీ కాదు. ఏపీలో మరికొన్ని దశాబ్దాల పాటు పాలనలో ఉండే పార్టీ.అందుకే మీరెవరు ఫిరాయింపుల పై మాట్లాడవద్దని సి.ఎం చంద్రబాబునాయుడు చెప్పినట్లు తెలుస్తోంది. ఏపీలో 29 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారిన సంగతి తెలిసిందే. వారితో రాజీనామా చేయించి గెలవాలని సవాల్ విసురుతున్నారు జగన్ పార్టీ నేతలు. ఆ విషయం పై మాట్లాడేందుకు కాస్తంత తటపటాయిస్తున్నారు టీడీపీ నేతలు. జగన్ చేతగానితనంతోనే వారంతా టీడీపీలో చేరారని చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు. అసలు విపక్షంగా వైసీపీ పూర్తిగా విఫలమైందని వారు ధ్వజమెత్తారు. అసలు జగన్ తన కంటే మంచి దుస్తులు వేసుకున్నా ఊరుకోరని..తన సీటు తప్ప మిగతా వారు కూర్చునేందుకు మనసు ఒప్పదంటారు. నంద్యాల ఎంపీ ఎస్పీవైరెడ్డి ఇలాంటి ఘాటు వ్యాఖ్యలే చేశారు జగన్ పై. తనను కూర్చోమని చెప్పలేదని..అలాంటి వ్యక్తి ఉన్న పార్టీలో ఒక్క క్షణం ఉండేది లేదని చెప్పారు. అందుకే ఎన్నికల్లో గెలిచిన 24 గంటల్లోపే పార్టీ మారారు. ఇప్పుడు మిగతా నేతలదీ అదే తీరు అంటున్నారు. విషయం ఏదైనా తెలంగాణ టీడీపీ నేతలు ఇప్పుడు కాస్తంత ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరముంది. అందుకే ఫిరాయింపుల పై మాట్లాడవద్దని చెప్పారని తెలుస్తోంది
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*