కేసీఆర్ ను ఆకాశానికెత్తిన వెంకయ్య



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణ సిఎం కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకెళుతున్న కేసీఆర్ అభినందనీయుడన్నారు. అంతే కాదు..ప్రధాని నరేంద్ర మోడీకి సరైన సలహాలు ఇస్తుంటారని గుర్తు చేశారు. ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాద్ కోవింద్ హైదరాబాద్ వచ్చిన సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ఈ మాటలన్నారు వెంకయ్యనాయుడు. పెద్ద నోట్ల రద్దు విషయంలోను, జిఎస్టీ అమలు విషయంలోను కేంద్రానికి కేసీఆర్ బాగా సహకరిస్తున్నారని చెప్పారు. అందుకే కేసీఆర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు వెంకయ్య. వెంకయ్యనాయుడు వల్లనే తెలంగాణ ఆలస్యమవుతుందని గతంలో తప్పు పట్టారు గులాబీ నేతలు. కానీ అవేం ఇప్పుడు మనసులో పెట్టుకోకుండా అందరూ చాలా సంతోషంగా ఉండటం శుభపరిణామం. జిఎస్టీ అమలు విషయంలో మూడు సార్లుతమతో కేసీఆర్ మాట్లాడరని గుర్తు చేశారు వెంకయ్య. మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థి పేరు ప్రకటించగానే…తమకు మద్దతు పలికిన ఎన్డీఏతర పార్టీ టీఆర్ఎస్ నేనని చెప్పారు వెంకయ్య. మరోవైపు వెంకయ్యతో పాటు. బండారు దత్తాత్రేయ, బీజేపీ నేతలు మురళీధర్ రావు, లక్ష్మణ్ లను శాలువాలతో సత్కరించారు సి.ఎం కేసీఆర్. తనకు మద్దతు తెలుపుతున్న నేతలందరికీ ధన్యవాదాలు తెలిపారు మరోవైపు రామ్ నాధ్ కోవింద్. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందనే సంకేతాలు వస్తున్నాయి. ఈ మేరకు కేసీఆర్ తో బీజేపీ నేతలు మంతనాలు చేస్తారంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎవరూ ప్రకటనలు చేయకపోయినా..వారి కలిసే చేసే కార్యక్రమాలకు హాజరు కావడం ఆహ్వానించ దగ్గ విషయమే. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*