అయ్యా…అంటూ చేతులెత్తి నమస్కరించిన తుమ్మల



Want create site? Find Free WordPress Themes and plugins.
అయ్యా మీరు స్కూలుకు రండి. స్కూలు ఉన్న ఊరిలోనే ఉండండి. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. పని చేసే చోటే ఉండి పాఠాలు చెప్పండి. తెలంగాణ రహదారులు – భవనాలు – స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన మాటలివి. ఉపాధ్యాయులు చేస్తున్న పనికి ఒక సందర్భంలో అసహనం వ్యక్తం చేశారాయన. దానికంటే చేతులెత్తి దండం పెట్టడమే మేలు అని భావించారేమో అదే పని చేశారు. మంత్రి తుమ్మల ఇలా చేసేందుకు కారణం ప్రభుత్వ పాఠశాలలలోని ఉపాధ్యాయులు. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఎన్ ఆర్ ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంచీలు – డిజిటల్ టీవీల పంపిణీ చేసిన మంత్రి ఉపాధ్యాయుల గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు. ఉపాధ్యాయులకు చేతులెత్తి దండం పెడుతున్నా…ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఇష్టానుసారం వ్యవహరించవద్దని కోరుతున్నా అని చెప్పారు. సి.ఎం కేసీఆర్ ఎంతో శ్రమకోర్చి మీకు వసతి, సౌకర్యాలుకల్పిస్తున్నారు. దాన్ని మీరు చెడగొట్టవద్దని చెప్పారాయన. బడుల బలోపేతానికి కృషి చేయడంలేదు.. విధి నిర్వహణలో నిబద్ధత లోపిస్తోందని చెప్పిన తుమ్మల చేతులెత్తి నమస్కరిస్తున్నా.. పనిచేసే చోటే ఉండి పాఠాలు బోధించండి అని అభ్యర్థించారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*