పాక్ పై జయభేరి..పదో మ్యాచ్ లోను విజయం



Want create site? Find Free WordPress Themes and plugins.
చాంపియన్స్ ట్రోపీలో పాక్ చేతిలో భారత్ ఓటమిని మర్చిపోలేక పోతున్నారు భారతీయులు. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ఈ సారి మహిళా జట్టుకు ఆ అవకాశం వచ్చింది. అంతే ఇరగదీశారు. పాక్ కు చుక్కలు చూపించారు. ఒకటా..రెండా పదో మ్యాచ్ లో పాక్ కు ఓటమి. అసలు భారత్ తో ఆడిన పది వన్డే మ్యాచ్ లలో పాక్ ఒక్కటీ గెలవలేదంటే భారత్ ఎంత కసిగా ఆడుతుందో అర్థమవుతోంది. అదే సమయంలో ప్రపంచ కప్ లో మిధానిసేన తన జైత్రయాత్రను కొనసాగిస్తూ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. భారత గెలుపులో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఏక్తా బిష్త్‌ (10–2–18–5) కీలకపాత్ర పోషించింది. ఐదు వికెట్లు తీసిన ఏక్తాకు ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మొదటగా బ్యాటింగ్ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. పూనమ్‌ రౌత్‌ (72 బంతుల్లో 47; 5 ఫోర్లు), సుష్మ వర్మ (35 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్‌) లు రాణించారు. పాక్‌ బౌలర్లలో నష్రా సంధు 4 వికెట్లు తీసి భారత్ ను కట్టడి చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్‌ 38.1 ఓవర్లలో 74 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ సనా మీర్‌ (29)దే టాప్‌ స్కోర్‌ మిగతా వారెవరు అంతకు మించి స్కోరు చేయలేదు. టాస్‌ నెగ్గిన భారత్‌ మొదట బ్యాటింగ్‌ తీసుకుంది. సెంచరీ, అర్థ సెంచరీలతో చెలరేగుతున్న స్మతి మంధన  ఈ సారి రెండు పరుగులే చేసి విఫలమైంది. ఆ తర్వాత దీప్తి శర్మ, పూనమ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించింది. పిచ్‌ పూర్తిగా బౌలర్లకు సహకరిస్తుండటంతో పరుగుల వేగం మందగించింది. మిథాలీ రాజ్‌ (8), దీప్తి శర్మ (63 బంతుల్లో 28; 2 ఫోర్లు) తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. ఫలితంగా భారత్ 169 పరుగులే చేసింది. బౌలింగ్‌లో ఏక్తాబిష్త్ ధాటికి పాక్ 74 పరుగులే చేసి ఓటమి పాలైంది. ఆ జట్టు ఓపెనర్‌ నాహిదా ఖాన్‌ (23),  కెప్టెన్‌ సనా మీర్‌ (29) ఆదుకునే ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*