కమ్మవారంతా మంచోళ్లు కారన్న జగన్



Want create site? Find Free WordPress Themes and plugins.
వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి ఈ మధ్య కమ్మ వారి గురించి బాగా కలవరిస్తున్నట్లు ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది. గోదావరి జిల్లా గరగపర్రు వెళ్లిన సందర్భంలో  కొత్త మాటలు పదాలు కలిపారాయన. అందరు కమ్మవారు మంచోళ్లు కారు. అందరు కమ్మ వారు చెడ్డవాళ్లు కారు. అదే సమయంలో అందరు రాజులు మంచోళ్లు కారు. అందరు రాజులు చెడ్డవారు కాదని వేదాంతధోరణిలో మాట్లాడారు. దీంతో అసలు కమ్మ, రాజుల గురించి ఆయన ఎందుకు ప్రస్తావించారో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు ఆ పార్టీ నేతలు. గరగపర్రులో ఉద్రిక్తతలు ఉన్నాయి. వారిని సముదాయించాలి. ఎవరికి అనుకూలంగా మాట్లాడినా మరొకరికి వ్యతిరేకంగా మాట్లాడినా తేడా వస్తోంది. అందుకే అక్కడ ఆచితూచి మాట్లాడారు. మా వాళ్లు ముగ్గురిని అరెస్టు చేశారని చెబితే..తాను విపక్ష నేతను అని చెప్పారు. నాకు సంబంధం లేదన్నారు. మరోవైపు దళితుల వద్దకు వెళ్లిన సందర్బంలో నిందితులను ముగ్గురుని అరెస్టు చేశారు కదా..అన్ని సర్దుకు పోతాయని చెప్పారు. ఇరు వర్గాల వద్ద ఏం మాట్లాడలేని పరిస్థితి. ఇంకోవైపు జగన్ రాజకీయాల్లోకి వచ్చాక తొలిసారిగా కాస్త జాగ్రత్తగా మాట్లాడింది ఇదేనంటున్నారు. అందుకే ఇక ముందు ఇలానే విపక్షంగా తన పాత్ర నిర్వహిస్తే మంచిదంటున్నారు రాజకీయ పండితులు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*