జగన్ పార్టీని కలవరిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు



Want create site? Find Free WordPress Themes and plugins.
గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ జపం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచి వేణుగోపాల్ రెడ్డి జగన్ పార్టీకి మద్దతుగా టీడీపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాను అలాంటి వాడిని కాదని..అచ్చ తెలుగుదేశం పార్టీ భావనలు తనవి అని చెప్పుకొచ్చారు వేణుగోపాల్ రెడ్డి. తన నియోజకవర్గంలో పార్టీ నేతలను నియమించే విషయంలోను ఆయనతో స్థానిక నేతలకు ఇబ్బందులు వచ్చాయి. ఫలితంగా పార్టీ అధినేత జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆయన రాబోయే ఎన్నికల్లో టీడీపీని వీడి జగన్ జెండా పడతారంటున్నారు. ఇప్పుడు కొత్తగా మరో పేరు వ్యాప్తిలోకి వచ్చింది. అతనే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. తన ఇద్దరు కుమారుల చేష్టలతో తెలుగు ప్రజలే కాదు.దేశవ్యాప్తంగాను విమర్శలు వచ్చాయి. కేసులు నమోదయ్యాయి. కారులో వెళుతు మహిళలను వేధించారనే ఆరోపణలు వచ్చాయి. అంతే కాదు..గుంటూరు జిల్లా పత్తిపాడులో టీడీపీ నేతలతోను రావెల సరిగా వ్యవహరించడం లేదనే విమర్శలు వచ్చాయి. అసలు ఎవరినీ ఆయన లెక్కచేయడంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు అంతంత మాత్రంగానే వస్తారని..లెక్కలేకుండా వ్యవహరిస్తున్నాడనే వాదన లేకపోలేదు. ఇప్పుడు ఆయన పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారంటున్నారు. అందుకే ఇప్పటి నుంచి నియోజకవర్గంలో తన సొంత క్యాడర్ ను తయారు చేసుకుంటున్నారని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో రావెలకు ఎలాగు టీడీపీ టిక్కెట్ రాదంటున్నారు. అందుకే దీపం ఉండగానే ఇళ్లు చక్కపెట్టుకోవాలనే సామెతగా..రావెల జగన్ పార్టీకి సహకరిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. రావెల పార్టీ మారితే జగన్ ఆయనకు టిక్కెట్ ఇస్తారో లేదో మరి.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*