సర్వేలు ఎన్ని చేసినా విజయం టీడీపీదే



Want create site? Find Free WordPress Themes and plugins.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ మధ్య రహస్య సర్వే చేయించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పార్టీల పరిస్థితి. గెలుపు గుర్రాలు ఎక్కేది ఎవరు. ఏం చేస్తే బావుటందనే అంశాల పై వివరాలు తీసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై సర్వే చేయించారు. రాజ‌కీయంగా త‌న‌కు ఎవ‌రెవ‌రు క‌లిసి వ‌చ్చే వీలుంది. ఏం చేయాలనే అంశం పై ఆయన క్లారిటీగా ఉన్నారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు పాల‌న ఎలా ఉందనే అంశం పై చేసిన సర్వేలో టీడీపీకి అనుకూలంగా సర్వే రిపోర్టు వచ్చింది. ఇప్పుడూ సర్వే రిపోర్టు చంద్రబాబునాయుడుకు చేరింది. ఇంటర్నల్ సర్వేలో టీడీపీదే విజయం కావండతో రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం వస్తోంది. ఇటీవల వైసీపీ తీసుకు వచ్చిన ఎన్నికల రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ సర్వేలోను చంద్రబాబుకే జనం పట్టం కడతారని వచ్చింది. పద్దతి మార్చుకోవాలి. లేకపోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్లు కష్టమనిచెప్పారట ప్రశాంతంగా కిషోర్. మరోవైపు చంద్రబాబు చేయించిన అంతర్గత స‌ర్వేలోను ఏపీ ప్ర‌జ‌లు మ‌ళ్లీ బాబుకే జై కొట్టిన‌ట్టు తెలుస్తోంది.  ప‌ట్టిసీమ ప్రాజెక్టు, పోల‌వ‌రం, హంద్రీనీవా, రాయ‌ల‌సీమ‌కు కృష్ణా జ‌లాలు, ప్రతి ఫించన్‌దారునికి సకాలంలో డబ్బులు అంద‌డం, రుణ‌మాఫీ, పాలనలో పారదర్శకత, ఉద్యోగుల్లో జవాబుదారీ తనం, లంచాలు తీసుకుంటే ఊరుకోక పోవడం, వీలున్నంత వరకు పైరవీలు తావు లేకుండా పాలన వంటి అంశాలు బాబుపై జ‌నాల్లో అభిమానం త‌గ్గ‌కుండా చేశాయ‌ని ఈ స‌ర్వేలో తేలింద‌ట‌. కానీ స్థానిక ఎమ్మెల్యేల్లో చాలా మందిపై వ్య‌తిరేక‌త ఉంద‌ని తెలుస్తోంది. దానిని స‌రిచేసుకోక పోతే ఇబ్బంది తప్పదని హెచ్చరించాయి ఆ సర్వేలు. కేంద్ర నిఘా వ‌ర్గాల ద్వారా బీజేపీ రిపోర్ట్‌ను కొంద‌రు స‌న్నిహితులు ఇప్ప‌టికే బాబుకు చేర‌వేసిన‌ట్టు తెలుస్తోంది. జేసీ దివాకర్ రెడ్డికుటుంబ సభ్యులు, ప్రకాశంలో గొట్టిపాటి, కరణం వర్గాలు, కడపలో రామ సుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి, గుంటూరులో వేణుగోపాల్ రెడ్డి ఘటన ఇలా చాలా జిల్లాల్లో నేతల మద్య ఐక్యత లేకపోవడం మైనస్ గా మారే అవకాశముందని తెలుస్తోంది. మంచి వారికి సీట్లు ఇస్తే టీడీపీ గెలుపు సులువ‌వుతుంది. పట్టణ ఓటర్లల్లో గతంలో ఉన్న మద్దతు ఇప్పుడు యధాతథంగా కనిపిస్తుండగా…గ్రామాల్లో టీడీపీ బలం పెరిగిందని ఆ సర్వేల్లో వెల్లడైంది. అంటే ఈ లెక్కన మరోసారి చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ప్రధాని మోడీ పూర్తిగా నమ్ముతున్నారు. అందుకే మోడీ 2019లో టీడీపీతోనే ఏపీలో క‌లిసి వెళ్లేందుకు రెడీగానే ఉన్నారంటున్నారు. కన్నా, పురంధేశ్వరి, సోము వీర్రాజు, కావూరి వంటి వారు టీడీపీ పై విమర్శల దాడి చేస్తున్నా..ఆ పార్టీతో పొత్తు తప్పదనే చర్చ సాగుతోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



1 Comment

Leave a Reply

Your email address will not be published.


*