జై లవకుశ స్టిల్స్ లీక్Want create site? Find Free WordPress Themes and plugins.
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా జై లవకుశ. దసరాకు ఈ సినిమా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు చిత్ర నిర్మాతలు. ఈ లోపే ఆ సినిమాకు సంబంధించిన స్టిల్స్ నెట్టింటికి వచ్చేశాయి. అంతే వైరల్ గా వచ్చిన ఆ ఫొటోలు చూసేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు. రావణ దహనం బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ పై తెరకెక్కించిన ఫైట్ సీన్ కు సంబంధించిన స్టిల్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. కువైట్ నుంచి నెట్ ద్వారా ఈ స్టిల్స్ ను లీక్ చేసినట్లు భావిస్తున్నారు. ఈ సినిమాకు ఆన్ లైన్ ఎడిటర్ పనిచేస్తున్న గణేష్ అనే వ్యక్తి లీక్ చేశాడని అనుమానిస్తున్నారు. గణేష్ తన ఫ్రెండ్స్ ద్వారా కువైట్ నుంచి ఈ ఫోటోలు పోస్ట్ చేయించాడంటున్నారు. ఇదే విషయం పై ఈ మూవీ నిర్మాత కళ్యాణ్ రామ్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు పోలీసులు గణేష్ ను అరెస్ట్ చేసి కూపీ లాగుతున్నారు. కావాలనే అతను ఈ పని చేశాడా..వాస్తవం ఏంటనే వైనం పై విచారణ చేస్తున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*