ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు



Want create site? Find Free WordPress Themes and plugins.
ఆరు ముస్లిం దేశాల పౌరులపై పాక్షిక నిషేధం విధించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీనిపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. కింది కోర్టులలో ఎదురు దెబ్బలు తిన్నారు ట్రంప్. కానీ సుప్రీంకోర్టులో అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పైచేయి అయింది. సుప్రీంకోర్టు ఆయన నిర్ణయాన్ని స్వాగతించింది. దేశ భద్రత విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం స్వాగతించదగ్గదని చెప్పింది. అమెరికాలో నివాసముంటున్న వ్యక్తులు లేదా సంస్థలతో చట్టబద్దమైన సంబంధాలుంటే వారు దేశంలో ప్రవేశించవచ్చని తెలిపింది. చెల్లుబాటయ్యే వీసా ఉన్న వారిని కూడా అనుమతించాల్సిందేనని స్పష్టం చేసింది కోర్టు. అక్టోబర్‌లో ఈ కేసు పూర్తి స్థాయి విచారణ జరిగే వరకూ ఈ ఉత్తర్వులు కొనసాగుతాయి. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్‌ దేశాల నుంచి అమెరికాకు వచ్చే పౌరుల్ని 90 రోజుల పాటు రాకుండా అడ్డుకోవచ్చు. భారత ప్రధాని మోడీ అక్కడ అడుగు పెట్టగానే ట్రంప్ కు అనుకూలంగా నిర్ణయం రావడం శుభపరిణామం.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*