హరీష్ శంకర్ తిక్క లేచిందా…



Want create site? Find Free WordPress Themes and plugins.
డీజే దువ్వాడ జగన్నాథం’ సినిమా డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌. గబ్బర్ సింగ్ వంటి హిట్ సినిమాలు తీసిన ఘనత ఆయనదే. కానీ డీజే విడుదలయ్యాక ఆయన ఫోకస్ మీడియా మీదకు మళ్లింది. ‘డీజే’ సినిమాపై కొన్ని వెబ్‌సైట్లలో వచ్చిన రివ్యూలపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘నాకు కళ్లు నెత్తికెక్కాయి అనడానికి మీరెవరు అంటూ రిపోర్టర్ల పై నిప్పులు చెరిగాడు. ‘నేను ఎవ్వరి విమర్శలకు సమాధానం చెప్పను. నా తీరే ఇంత అని చెప్పారాయన. నేను సీతయ్యను..నేను ఇంతే అనే తరహాలో హరీష్ శంకర్ మాట్లాడటం ఇప్పుడుహాట్ టాపికైంది. డీజే’ సినిమాపై  అనుకూలంగా, వ్యతిరేంగా కథనాలు వచ్చాయి. కొందరు బాగుందంటే..మెజార్టీ రివ్యూలు యావరేజ్ అని ఇచ్చాయి. మరో పోటీ సినిమా లేకపోవడంతో డీజీ సినిమా వసూళ్లును బాగానే రాబడుతోంది. ఆ ధీమాతో హరీష్ శంకర్ కాస్తంత ఘాటుగానే మాట్లాడారు. నాకు కొంచెం తిక్కుంది. కానీ దానికో లెక్క ఉందనే డైలాగ్ లు రాసుకున్న అతను..ఇప్పుడు అదే మాటలను ప్రస్తావించడం హాట్ టాపికైంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజాహెగ్డే హీరో హీరోయిన్లుగా నటించి డీజీ బాగానే ఆడుతోంది. దీంతో హరీష్ శంకర్ కాస్తంత ఎక్కువ చేసి..మీడియా పై విరుచుకుపడటం బాగోలేదంటున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*