అట్టహాసంగా నామినేషన్ వేసిన మీరాకుమార్



Want create site? Find Free WordPress Themes and plugins.
రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్ తన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మీరాకుమార్ ఈ పోటీని కులాల మధ్య సంగ్రామంగా చూడవద్దన్నారు. కాంగ్రెస్ సహా 17 విపక్షపార్టీలు తనను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టారని పేర్కొన్న ఆమె.. సబర్మతి ఆశ్రమం నుంచి రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కొలీజియం సభ్యులను కోరుతానని చెప్పారు మీరాకుమార్. కులవ్యవస్థను రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఎన్నిక దళితుల మధ్య పోటీ కాదన్నారు. సైద్ధాంతిక అంశాల ఆధారంగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ పడుతానని మీరాకుమార్ తెలిపారు. నేను ఓడిపోతానని ఎందుకు అనుకుంటున్నారు. గట్టి పోటీ ఇస్తాను అని అన్నారు మీరాకుమార్. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*