యార్లగడ్డ, దగ్గుబాటి వారసులు వైసీసీలోకి…



Want create site? Find Free WordPress Themes and plugins.
రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు డాక్ట‌ర్ యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీప్ర‌సాద్ జగన్ పార్టీకి దగ్గరవుతున్నారు. గతంలో ఆయనకు ఇచ్చిన ప్రయార్టీ ఇప్పుడు టీడీపీ ఇవ్వడం లేదు. టీడీపీ సర్కారుకు వ్యతిరేకంగా ఆయన ఆందోళనలు చేయడమే ఇందుకు కారణం. ఇటీవల యార్లగడ్డ తానా సభలతో పాటు.. చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గతంలో యార్లగడ్డ వచ్చారంటే తెలుగు తమ్ముళ్లు బాగా హడావుడి చేసేవారు. ఇప్పుడు సీన్ రివర్స్. టీడీపీ వారు కాదు.. జగన్ పార్టీ నేతలు ఆయన్ను తమతో కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు.
             ఇంతకు అసలు విషయం ఏంటంటే… రాబోయేకాలంలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కుమారుడు యార్లగడ్డ శివరాం వైజాగ్ నుంచి వైసీపీ పక్షాన ఎన్నికల్లో పోటీ చేయనుండటమే ఇందుకు కారణమట. బీజేపీ మహిళా మోర్చా జాతీయ నేతగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి, వెంకటేశ్వర్లు దంపతుల కుమారుడు దగ్గుబాటి చెంచురామ్ రాజకీయాల్లోకి రానున్నారు. బీజేపీలో సరిగా ఇమడలేకపోతున్నారామె. అందుకే తన కుమారుడిని వైసీపీ నుంచి పర్చూరు నియోజకవర్గం లో పోటీ చేయించేందుకు ఆమె పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆ సీనియర్లు ఇద్దరు… తమ పిల్లల కోసం పార్టీ మారే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*