లండన్ లో ఘనంగా ఇఫ్తార్ విందు Want create site? Find Free WordPress Themes and plugins.
రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ఎన్నారై టీ.ఆర్.యస్ యుకె  మరియు తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) ఆధ్వర్యంలో లండన్ లో ముస్లింలకు ఇఫ్తార్ విందునివ్వడం జరిగింది. ఎన్నారై టీ.ఆర్.యస్ సెల్ యుకె ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో హైదరాబాద్ అసోసియేషన్ అఫ్ యుకె సభ్యులతో పాటు స్థానిక ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఎన్నారై టీ.ఆర్.యస్ అధ్యక్షుడు మరియు టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ ముస్లిం, హిందువుల మత సామరస్యానికి రంజాన్ దీక్షలు ప్రతీక అని అన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. 
                       అలాగే మన ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు రాజకీయంగా సామాజికంగా అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు, డిప్యూటీ సీఎంగా, ఎమ్మెల్సీలుగా, ఉప కులపతులుగా, కార్పొరేషన్‌ ఛైర్మన్లుగా, డిప్యూటీ మేయర్లుగా ఇలా ఎన్నో ఉన్నతమైన పదవులనిచ్చి, మైనారిటీల పట్ల ప్రత్యేక శ్రద్ధతో మన ప్రభుత్వం పని చేస్తుందని, మైనార్టీల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ముస్లింలకు మంచి జరుగుతుందంటే ప్రభుత్వం ఏం చేయడానికైనా సిద్ధమేనని తెలిపారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యక్షుడు అశోక్ గౌడ్ మాట్లాడుతూ ఇలాంటి పర్వదినాల సందర్భంగా మతసామరస్యం పెంపొందుతుందని చెప్పారు. ముస్లింలు అత్యంత నియమ నిష్ఠలతో రంజాన్‌ను జరుపుకొంటారని చెప్పారు.
                 ఉపాధ్యక్షుడు నవీన్  రెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం, అలాగే కేసీఆర్ ముస్లింల అభివృద్ధికి తీసుకుంటున్న కార్యక్రమాలను వివరించారు. ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పెద్దిరాజు మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడ లేని గంగ జామున తహజీబ్ మన తెలంగాణకే సొంతమని, ప్రజలంతా అన్నదమ్ములా కలిసి ఉంటారని, అది దేశానికే ఆదర్శమని చెప్పారు. ప్రధాన కార్యదర్శి రత్నాకర్ మాట్లాడుతూ భిన్నత్వంలో… ఏకత్వంలా హిందూ-ముస్లిం వర్గాలవారు కలసిమెలిసి, రంజాన్ జరుపుకోవడం మతసామరస్యానికి నిదర్శనమన్నారు.
                       ఈ సంధర్భంగా హాజరైన హైదరాబాద్ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ అధ్యక్షుడు ముజీబ్ ఇఫ్తార్ విందు అనంతరం మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం క్రమంగా తప్పకుండ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న ఎన్నారై టీ.ఆర్.యస్ సెల్ ని అభినందించి, కేసీఆర్ నాయకత్వంలో ముస్లింలు ఎంతో ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారని, ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని అల్లాని ప్రార్థిస్తున్నామని, మత సామరస్యానికి ప్రతీకైన రంజాన్ పండుగ ఉపవాస కార్యక్రమాలు ఎంతో పవిత్రమైనవన్నారు.
                    ఈ కార్యక్రమంలో ఎన్నారై టీ.ఆర్.యస్ సెల్ అద్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు అశోక్ దూసరి, నవీన్ రెడ్డి, శ్రీకాంత్ పెద్దిరాజు, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసర్ బోర్డు సభ్యులు ప్రవీణ్ కుమార్ వీర, సెక్రటరీ సృజన్ రెడ్డి, మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల, ఈయూ ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి, ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్ రమేష్ యెసంపల్లి, నవీన్ మాదిరెడ్డి, ఈవెంట్స్ కో ఆర్డినేటర్స్ సత్యపాల్ పింగిళి, సత్య చిలుముల, రవి ప్రదీప్, నవీన్ భువనగిరి, శ్రీధర్ రెడ్డి, వెంకీ మరియు హైదరాబాద్ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ అధ్యక్షులు ముజీబ్, సయ్యద్ షా నవాజ్, ఇర్ఫాన్, షరీఫ్, షా సాబ్, ఆదిల్, ఫయాజ్ తదితరులు హాజరయ్యారు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*