సెల్ పోన్ వాడితే టీచర్ల సస్పెన్ష న్



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గట్టిగానే టీచర్లను హెచ్చరించారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.74 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను కడియ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కడియం ఉపాధ్యాయులు ఎవరైనా తరగతి గదిలో సెల్ ఫోన్ వినియోగిస్తే కచ్చితంగా వారిని ఇంటికి పంపిస్తామన్నారు.ఇందుకు సంబంధించిన ఆధారాలను తమకు ఇవ్వాల్సి ఉంటుందనే కండీషన్ పెట్టారాయన. పిల్లలకు పాఠాలు చెప్పకుండా..సెల్ ఫోన్లతో కొందరు టీచర్లు క్లాస్ లో మాట్లాడుతున్న సంగతులు చాలా వెలుగులోకి వచ్చాయి. అనేక మంది విద్యార్థులు,తల్లి దండ్రులు ఈ విషయం పై మంత్రి కడియం శ్రీహరికి చెప్పడంతో ఆయన ఇలా స్పందించారు. మీకు ఉద్యోగం ఇచ్చింది. పిల్లలకు పాఠాలు చెప్పడానికి. అందుకు విరుద్దంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పారాయన.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*