దువ్వాడ జగన్నాధమ్ ( డిజే) : సమీక్షWant create site? Find Free WordPress Themes and plugins.
రేటింగ్ : 3.0/5
దర్శకుడు : హరీష్ శంకర్
నిర్మాత : దిల్ రాజు
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
నటీ నటులు : అల్లు అర్జున్, పూజా హెగ్డే, రావు రమేష్, తనికెళ్ల భరణి, మురళి శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు
విషయం ఏంటంటే…
మెగా హీరో బన్నీ మరోసారి తన సత్తా చాటాడు. నటనతో అదరగొట్టాడు. డాన్స్ తో ఇరగదీశాడు. సరైనోడు తర్వాత వచ్చిన సినిమా కావడంతో అభిమానుల అంచనాలు బాగానే ఉన్నాయి. వారిని నిరాశ పరచకుండా తన నటనతో ఆకట్టుకున్నాడు దువ్వాడ. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత హరీష్ శంకర్ అందిస్తున్న సినిమా కావడం ఒక ఎత్తయితే.. బెనిఫిట్ షోలు లేకుండా చేయడం మరో ఎత్తు. సినిమా నిర్మాణంలో లోపాలు ఉన్నాయని గ్రహించే బెనిఫిట్ షోలు రద్దు చేశారేమోనన్న సందేహాలు కలుగుతున్నాయి.
                  అసలే నమకం, చమకం వంటి పదాలను పాటలో వినియోగించడం పై వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఆర్య, పరుగు వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలు తర్వాత అల్లుఅర్జున్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో చేసిన మూడో చిత్రం ఇది. అంతే కాదు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన 25వ సినిమా కావడం మరో విశేషం. బన్నితో ఆర్య, ఆర్య2, సన్నాఫ్ సత్యమూర్తి, జులాయి వంటి సినిమాలతో పాటు….శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఆర్య, బొమ్మరిల్లు వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్. ఆయనే ఈ చిత్రానికి సంగీతం అందించడం ప్లస్ పాయింట్ అయింది. 
భారీ అంచనాలు…
అల్లుఅర్జున్, దిల్ రాజు, హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ ల బ్లాక్ బస్టర్ కాంబినేషన్ తో రూపొందిన సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. అల్లు అర్జున్ డాన్స్ లతో పాటు… ఫైట్ లు బాగున్నాయి. డీజే ఫస్ట్ హాఫ్ కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ సెకండ్ హాఫ్ లో కొంత గందరగోళం నెలకుంది. మాస్ ఆడియన్స్ కు ఈ చిత్రం బాగా నచ్చుతుంది. క్లాసికల్ పీపుల్ ఈ సినిమాను లైట్ తీసుకునే అవకాశం ఉంటోంది. ఇప్పుడు పోటీ సినిమాలు ఏవి లేవు కాబట్టి బాగానే ఆడే వీలుంది. సినిమాకు అప్పుడే మిశ్రమ టాక్ వస్తోంది. సినిమా యావరేజ్ అని కొందరు చెబుతుంటే…మరికొందరు సూపర్, బాగుందంటున్నారు. కానీ హిట్ టాక్ తెచ్చుకుంటుందని చెప్పవచ్చు. దేవిశ్రీప్రసాద్ సంగీతం ప్రధాన ఆకట్టుకుంది. ఒడిలో బడిలో సాంగ్ అదుర్స్. సినిమా కథ, కథనాన్ని నడిపించిన తీరు అంత ఆసక్తికరంగా లేదు. కథలో పట్టు కోల్పోయింది. సినిమా అప్పుడే అయిపోయిందా అనే సందేహం ప్రేక్షకులకు కలుగుతోంది. దర్శకుడు ఎందుకో కాస్తంత గందరగోళంలో పడి సీన్స్ ను కొన్నింటిని సరిగా ప్రేమ్ చేయలేకపోయారనిపిస్తోంది. భారత్ లో మార్నింగ్ షోలు పడటానికి ముందే యుస్, ఇతర దేశాల్లో ప్రీమియర్ షోలు వేశారు. 
కథ ఏంటి…
డీజే-దువ్వాడ జగన్నాథమ్’ ఓ పోలీస్ ఆఫీసర్.  ఓ కేసు విచారణలో భాగంగా బ్రాహ్మణ వంటవాడిగా మారువేషం వేస్తాడు డీజే. సినిమా తొలి భాగం కామెడీ సీన్లు, పంచ్ లు, రొమాన్స్, పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇంటర్వెల్ ముందు 20 నిమిషాలు సినిమా చాలా బాగుంది. బాగా తీశారు. కానీ సినిమా సెకండాఫ్ కూడా ఇంటెన్స్ యాక్షన్ తో బావుంది. కానీ ఫస్టాఫ్ తో చూసుకుంటే యావరేజ్ అనే చెప్పాలి. 
ఎవరు ఎలా నటించారంటే…
అల్లు అర్జున్ ఈ మూవీలో బ్రాహ్మిణుడిగా, డిజె క్యారెక్టర్లలో అద్భుతంగా నటించారు. సినిమాలో అతడి స్టైల్ కూడా చాలా బావుంది. ఈ సినిమా అల్లు అర్జున్ ను కొత్త తరహాలా చూపించింది. హీరోయిన్ గా పూజా హెగ్దే తన పాత్రకు బాగానే న్యాయం చేసింది. గ్లామర్ పరంగాను ఆకట్టుకుంది. ముఖ్యంగా బన్నీతో ఆమె కెమిస్ట్రీ బాగుంది. బన్నీ తో పాటు డాన్స్ లో  ఏమాత్రం తగ్గకుండా చెయ్యడం విశేషమనే చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో రావు రమేష్, తనికెళ్ల భరణి, మురళి శర్మ, వెన్నెల కిషోర్ పాత్రలు ప్రేక్షకులను అలరించాయి. 
                            అయానంక బోస్ పిక్చరైజేషన్ చాలా బాగుంది. డాన్స్, యాక్షన్ తో పాటు చాలా విషయాల్లో సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ ఆకట్టుకుంటోంది. మొత్తంగా ఫస్టాఫ్ బాగుండగా… సెకండాఫ్ యావరేజ్ అనే చెప్పాలి. టోటల్ గా రోటీన్ మసాలా మూవీ అనే చెప్పాలి.
ప్లస్ పాయింట్లు…
+ అల్లు అర్జున్ నటన
+ హీరో డాన్స్, పైట్స్
+ సంగీతం, మంచి పాటలు
+ ఆకట్టుకున్న ఒడిలో.. బడిలో సాంగ్
+ పూజా డాన్స్
+ రిచ్ లోకేషన్స్
+ డైలాగులు
మైనస్ పాయింట్లు…
– కథ, కథనంలో లోపాలు
– గందర గోళం
– క్లైమాక్స్ సరిగా తీయలేకపోవడం
– చెప్పే విషయాన్ని సరిగా చెప్పలేక పోవడం
– రొటీన్ మసాల 
చివరిగా… ఒకసారి చూడవచ్చు…
Did you find apk for android? You can find new Free Android Games and apps.1 Comment

Leave a Reply

Your email address will not be published.


*