చికాగోలో తెలుగు వారి విందు భోజనాలు



Want create site? Find Free WordPress Themes and plugins.
నిత్యం బిజీ జీవితంతో గడిపే చికాగోలోని తెలుగు వారు కాస్తంత ఆటవిడుపు పొందారు. చికాగో నగరంలోని తెలుగు వారంతా వన భోజనాల కార్యక్రమం పెట్టుకున్నారు. అన్ని సంఘాల నేతలు తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. ఆటపాటలతో అలరించారు. అంతే కాదు.. అరటి ఆకుల్లో భోజనం.. పసందైన తెలుగు వంటకాల ఘుమ ఘుమలతో అదిరిపోయింది. ఆరేళ్ల నుంచి అరవైఏళ్ల వారి వరకు ఈ ఆటల పాటల పోటీలో పాల్గొనడం విశేషం. ఆంధ్ర సంఘం వారు అరటి ఆకులలో భోజనాలు వడ్డించడమే కాదు.. గోంగూర, గుత్తి వంకాయ కూర వంటి ప్రత్యేకతలతోను ఆకట్టుకున్నారు. ఆంధ్ర వంటకాలు రుచులతో ఇక విందు భోజనాలు అలనాటి మాయబజారు సినిమాలోని ఘటోత్కజుడు పాత్ర, పాటను గుర్తుకు తెప్పించింది. చికాగో ప్రాంతములో ఉన్న తెలుగు సంఘాల వారు అంతా వచ్చి తమ ఐక్యతను మరోమారు చాటుకున్నారు. చికాగో ఆంధ్ర సంఘం అద్యక్షుడు సుందర్ దిట్టకవి తదితరుల ఆధ్వర్యంలో ఆత్మీయ అతిథుల విందు కార్యక్రమం జరిగింది. 

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*