రాష్ట్రపతి అభ్యర్థిగా రామనాద్ ను తెరపైకి తెచ్చిన బీజేపీ



Want create site? Find Free WordPress Themes and plugins.
రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్‌ గవర్నర్‌ రామనాథ్‌ కోవింద్‌ పేరు ఖరారు చేసింది బీజేపీ. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా మీడియాకు వివరాలు అందించారు. దీంతో ఇన్నాళ్లు నెలకున్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసిన తర్వాత కోవింద్‌ పేరును ప్రకటించారు అమిత్ షా. నేతలందరితో మాట్లాడకనే బీజేపీ ఈ అభ్యర్థిగా ప్రకటించామని చెప్పారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థుల ఎంపికపై చర్చించలేదని తెలిపారు మరోవైపు షా. 23న రామనాథ్‌ కోవింద్‌ నామినేషన్‌ వేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
       ఎన్డీఏ పక్షాలు సైతం రామనాథ్ పేరును అందులోను దళిత నేతను ప్రకటిస్తారని ఊహించలేకపోయాయి. దళిత నాయకుడైన రామనాథ్‌ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలోని డేరాపూర్‌‌. 1945, అక్టోబర్‌ 1న జన్మించిన రామనాథ్… వృత్తిరీత్యా న్యాయవాది. 1994-2006 మధ్యకాలంలో రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. 2015 నుంచి బీహార్‌ గవర్నర్‌గా ఉన్నారు. గతంలో బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగాను ఆయన పనిచేశారు. బీజేపీ ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. రాజ్‌నాథ్‌ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రామనాథ్ కీలకంగా వ్యవహరించారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*