ఏపీలో తిరిగి టీడీపీదే విజయమంటున్న సర్వేలుWant create site? Find Free WordPress Themes and plugins.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి మోగించడం ఖాయంగా కనిపిస్తోంది. అధికార పార్టీ నిర్వహించిన సర్వేలు కాస్త అనుమానాలు ఉంటాయి. కానీ విపక్ష పార్టీలు చేయించిన సర్వేల్లోను టీడీపీదే విజయమని చెప్పాయి. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెమటలు పడుతున్నాయి. అందులోను తాము ఏరి కోరి తెచ్చుకున్న సలహాదారు ప్రశాంత్ కిశోర్ ఈ మాట చెప్పడంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపికైంది. ఈ సారి కచ్చితంగా గెలవాలని జగన్ పార్టీ ఎత్తులు వేస్తుండగా.. ప్రజల్లో మంచి పాలన అందించి మరోసారి పీఠం ఎక్కాలని టీడీపీ చూస్తోంది. దీంతో ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. 
         జగన్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు వచ్చిన ప్రశాంత్ కిషోర్ తాపీగా తన పని తాను చేసుకుంటున్నాడు. కానీ ఆయన తెలిసిన వాస్తవాలు జగన్ పార్టీని దిమ్మతిరిగేలా చేస్తున్నాయి. ఎంతగా అంటే… వైసీపీ చేసిన సర్వేల్లో కచ్చితంగా తామే గెలుస్తామని చెబుతోంది. కానీ వారితో సంబంధం లేకుండా ప్రశాంత్ కిశోర్ చేయించిన సర్వేలో అది నిజం కాదని తేలింది. అంతే కాదు.. గెలవాలంటే అంత తేలిక కాదనే విషయం బోధపడింది. అందుకే ముందు హైదరాబాద్ నుంచి మకాం మార్చాలని జగన్ కు చెప్పాడు ఆయన. అంతే కాదు.. పార్టీ గెలవాలంటే ముందు విజయవాడకు ఆఫీసును మార్చాలని కోరారు. 
             ఆయన సర్వే వివరాలను ఒక్కసారి చూస్తే ఆసక్తికర అంశాలెన్నో ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఏపీలో 41శాతం ఓట్లతో 114 సీట్లతో ఏపీలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తోంది. అలానే 27శాతం ఓట్లతో 49 సీట్లతో రెండోస్థానంలో వైసీపీ ఉండగా.. జనసేన..మిగతా పార్టీలో ఏదో అత్తెసరు మార్కులు తెచ్చుకుంటోంది. ఇందుకు అయిన ఖర్చు రూ.8.5 కోట్లు. తనకున్న పలుకుబడితో మంత్రి ఒకరు.. వైసీపీ సర్వేలోని అంశాలను తెప్పించుకుని చూశారు. దానిలో అంశాలను ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం..
          ముందు మీరు సర్వేలోని అంశాలను చూడండి. దాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచిద్దాం. మీరు రమ్మంటేనే వస్తానని చెప్పి మరీ వెళ్లారట ప్రశాంత్ కిషోర్. ఆయన ఇచ్చిన షాక్ తో జగన్ కుదేలయ్యాడట. ఏం చేద్దాం చెప్పుమా అంటూ తలపట్టుకుంటున్నారని తెలుస్తోంది. 
సర్వేలో కొన్ని ప్రధానాంశాలు
               175 నియోజకవర్గాల సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు తిరిగి పోటీ చేస్తారనే ఆలోచనతో సర్వే చేయడం జరిగింది. ఒకవేళ అభ్యర్థులను మారిస్తే టీడీపీకి లాభం అని తెలుస్తోంది. టీడీపీకి పడే ఓట్లల్లో సి.ఎం చంద్రబాబనాయుడు హవాను చూసే ఎక్కువ మంది ఓటర్లు ఆకర్షితులవుతున్నారు. ఓటర్లల్లో 70శాతం మంది సి.ఎం పనితీరు చూసే ఓట్లేసేందుకు సిద్దమవుతున్నారు. మరోవైపు సిట్టింగ్‌ ఎమ్మెల్యే పనితీరు చూసి 30శాతం ముందుకు వస్తున్నారు. అంటే ఎమ్మెల్యేల పనితీరు కంటే ముఖ్యమంత్రి పనితీరు బాగుందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి బాగా పనిచేస్తున్నా అధికారులు, పరిస్థితులు అనుకూలించడం లేదన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది.
           2014కు ముందు ఉన్న పరిస్థితులతో పోలిస్తే ఈ మూడేళ్లలో ఏపీ పట్టణాలు, గ్రామాల్లో అభివృద్ధి బాగా కనిపిస్తోందని 43శాతం అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ హయం కంటే టీడీపీలోనే పాలన బాగా ఉందట. అభివృద్ధి జరిగింది. ఆ పెద్దగా పాలన ప్రభావం కనిపించట్లేదని 25శాతం, ఫర్వాలేదని 20శాతం, లేదు… తెలియదు, చెప్పలేమని మరో 12శాతం జనాలు అభిప్రాయపడ్డారు. 
          అలానే టీడీపీ చేసే అభివృద్ధి పనుల్లో ఎక్కువగా అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులు, పించన్లు వంటి వాటికి ఎక్కువ మార్కులు పడ్డాయి. మరోవైపు రైతు రుణమాఫీపై అన్నదాతలు బాగా సానుకూలంగా ఉన్నారు. గత సీఎంలు ఎవరూ చేయనిది, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోకపోయినా కూడా చేశారనే భావన రైతులు వ్యక్తం చేశారు. కేంద్రం పెద్దగా సహకరించక పోయినా సి.ఎం చంద్రబాబు బాగా పనిచేస్తున్నారని కితాబునిచ్చారు. అదే సమయంలో నిధులు ఉంటే మరిన్ని పనులుచేసేవారనేది వారి అభిప్రాయం.
జగన్ సంగతేంటి…
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహనరెడ్డి పనితీరు రోజు రోజుకు పడిపోతోంది. విపక్షంగా ఆయన సరిగా వ్యవహరించడం లేదని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జగన్‌కి ఓటేసే 100మందిలో జగన్‌ సీఎం కావాలనే వారు 40శాతం మందినే. అసలు విషయం ఏంటంటే మిగతా కారణాలతోనే ఆయన సి.ఎం కావాలని కోరుకుంటున్నారట. అవి కులాలు, మతాలు, ప్రాంతాలు కావచ్చు. మిగతా కారణాల వలన వేస్తున్నాము అనే వారు 60శాతం మంది ఉంటడం విశేషం. 
          పోయినసారి జరిగిన ఎన్నికల్లో జగన్ వైపు మొగ్గి ఓటర్లు ఈసారి అతని పనితీరుపై బాగా అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, స్థానిక రాజకీయాల వలన వైసీపీకి మద్దతు ఇస్తున్నారు తప్ప ఆయన పై ప్రేమతో కాదు. వైసీపీలో ఉన్నవారిలో సమర్థులను కాకుండా రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయసాయి వంటి వాళ్లపై జగన్‌ అతిగా ఆధారపడుతున్నారన్న భావన ఓటర్లలో ఉంది. ఒక్కోసారి వారి మాటలు పార్టీని మరింతగా ఇబ్బందుల్లోకి నెడుతున్నాయనే అభిప్రాయం ఉంది. పగలు పగలు ప్రజల వద్ద రాత్రి జబ్దరస్త్ షోల తో రోజా చేసే హడావుడిని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో సీరియస్ రాజకీయాలను వదిలి పబ్లిక్ గా డాన్స్ షోలు వేయడం ఓటర్లకు నచ్చడం లేదు.
                  మరోవైపు అసెంబ్లీలో రోజా, చెవిరెడ్డి ప్రవర్తన, వారి వ్యవహార శైలి వైసీపీకి తీవ్ర వ్యతిరేకత తెచ్చాయి. వారి ప్రవర్తన మార్చుకోకపోతే జగన్ పార్టీకి దెబ్బ పడుతోంది. వైఎస్‌ఆర్‌ సీపీకి ఓటేస్తాం అన్న ఓటర్లలో 78శాతం ఆనేతల వల్ల జగన్‌కి చెడ్డపేరు వస్తుందన్నారు.
కాంగ్రెస్ సంగతేంటి…
              రాష్ట్ర విభజనంతో అడ్రస్ లేకుండాపోయిన కాంగ్రెస్ ఈసారి బోణీ కొట్టనుంది. సింగిల్ డిజిట్ ఆ పార్టీ తెచ్చుకుంటోంది. బీజేపీతో పొత్తు వల్ల మైనార్టీలు, క్రైస్తవులు ఇంకా చంద్రబాబు వైపు మొగ్గు చూపడం లేదు. లేకపోతే చంద్రబాబు కుర్చికీ అసలు అనుమానమే లేదు. జగన్‌ను కూడా మైనార్టీలు పూర్తిగా నమ్మడం లేదు. 2014లో జగన్‌కు ఓటేసిన మైనార్టీల్లో 40శాతం కాంగ్రెస్‌, జనసేన వైపు మళ్లుతున్నా

 

రు. పవన్ కల్యాణ్ మాటలను జనం పెద్దగా విశ్వసించడం లేదు.
ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ తర్వాత క్రైస్తవులు, మైనార్టీలు జగన్‌ను విశ్వసించడం లేదు. తన కేసుల విషయంలో రాజీపడుతున్నారని భావిస్తున్నారు. అందుకే ప్రెసిడెంట్ ఎన్నికల్లో వారు అడగక పోయినా మద్దతునిస్తున్నారని అబిప్రాయపడ్డారు. అందుకే జగన్ ను నమ్మేందుకు వారు తటపటాయిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజాసమస్యల కంటే ప్రభుత్వంలోని వ్యక్తులపై జగన్ పార్టీ వ్యక్తిగత పోరాటం చేస్తోందని అత్యధికులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై కమ్యూనిస్టులు పోరాటం చేస్తున్నారని..అదే సమయంలో జగన్ పార్టీ అలా చేస్తే మంచిదంటున్నారు. 
పవన్ ను పట్టించుకోవడం లేదు…
         పైకి జనసేనను ప్రకటిస్తున్నా..ఆ పార్టీ ఇంకా ప్రజల్లోకి వెళ్లలేదు. యూత్ కు మాత్రమే జనసేన గురించితెలుసు. ఆయన ఏదో పోరాటం చేస్తున్నా..పెద్దగా ఆయన పై అంచనాలు లేవు. కాపులు, బ్రాహ్మణులకు గతంలో ఎవరూ రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అయా కులాల పేరుతో కార్పోరేషన్లు పెట్టి పిల్లలను ఫ్రీగా ఫారిన్ పంపించి చదివిస్తున్నారని ఆయా వర్గాల్లో సంతోషం కనిపించింది. 
       ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి నియోజకవర్గం నుంచి 20ప్రశ్నలపై 500మంది అభిప్రాయాల ఆధారంగా మే-17 -30తేదీల మధ్య నిర్వహించిన అభిప్రాయ సేకరణ వివరాలు ఇలా ఉన్నాయి.
సర్వే తుది ఫలితాలు
టీడీపీ+ 114 సీట్లతో 41% ఓట్లు
వైసీపీ 49 సీట్లతో 27% ఓట్లు
జనసేన+ 10 సీట్లతో 13% ఓట్లు
కాంగ్రెస్‌ 2 సీట్లు 7% ఓట్లు
ఈ దశలో ఎవరికి వేసేది చెప్పలేం 13%
             మొత్తంగా చూస్తే తిరిగి టీడీపీ అదికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుందని ఈ సర్వే చెబుతోంది. వైసీపీ నిర్వహించిన ఈ సర్వే ఇప్పుడు టీడీపీలో సంబరాన్ని నింపుతుండగా..జగన్ పార్టీని ఆందోళనలో పడేస్తోంది. నేను వచ్చి మీరు గెలుస్తారని కల్లబొల్లి కబుర్లు చెప్పను. వాస్తవాన్ని మీ ముందు ఉంచుతున్నానని…ప్రశాంత్ కిషోర్ చెప్పడంతో జగన్ పార్టీ నేతలు జుట్టు పీక్కుంటున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*