చిత్తుగా ఓడిన ఇండియా.. కప్ కొట్టిన పాక్



Want create site? Find Free WordPress Themes and plugins.
ఇరగదీస్తారనుకున్నారు. వీరులు చూరులు అని పొగిడారు. చివరకు ముందే చేతులెత్తేశారు. పైనల్స్ లో ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. ఫలితంగా పాక్ చేతిలో చిత్తయ్యారు. చాంపియన్స్ ట్రోపీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనుకుంటున్నారు అభిమానులు. తొలి వికెట్ గా రోహిత్ శర్మ పెవిలియన్ కు వెళ్లడంతోనే మిగతా వారు అదే బాట పట్టారు. బ్యాటింగ్ వీరులుగా పేరుపొందిన రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కోహ్లీ, యువరాజ్ సింగ్, ధోని, జాదవ్, జడేజాలు కొంపలు ముంచారు. మరోవైపు పాండ్యా పర్వాలేదనిపించాడు. అతను ఒక్కడే భారత్ పరువు కాపాడాడు. ఫలితంగా భారత్ 180 పరుగులతేడాతో ఓడిపోయింది. టాస్ గెలిచి పాక్ కు బ్యాటింగ్ అప్పగించాడు కోహ్లీ. పాక్ బ్యాట్స్ మెన్ పకర్ జమన్ ఔటయ్యాడు. పాండ్యా వేసిన ఆ బాల్ నో బాల్ అయ్యేసరికి బతికిపోయాడు. చివరకు అతనే సెంచరీ చేసి భారత్ ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఫలితంగా పాకిస్తాన్ 50 ఓవర్లకు గాను.. 4 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. భారీ స్కోరు చేయడంతో ఇక సులువుగానే భారత్ చేధిస్తుంది అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. 30.3 ఓవర్లల్లోనే 158 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ పరువు తీసింది. 

 

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*