ఎంపీ జితేందర్ రెడ్డికి ఏమైంది…



Want create site? Find Free WordPress Themes and plugins.
టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ చేసిన ట్వీట్ పై దుమారం రేగుతోంది. చాంపియన్స్ ట్రోపీలో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగే సమయంలో గులాబీ నేత ఓ ట్వీట్ చేశాడు. పైనల్ లో బంగ్లాదేశ్-పాకిస్తాన్ ఆడితే చూడాలని ఉందనేది సారాంశం. అంతే సెమీస్ లో  భారత్ ఓడిపోవాలనేది ఆయన ఆలోచనగా ఉంది. బారతీయుడు అయి ఉండి..ఇలా బంగ్లాదేశ్ కు మద్దతునిస్తాడా అంటున్నారు జనాలు. అంతే కాదు..పార్లమెంటు సభ్యుడైన వ్యక్తి ఇలా పక్క దేశానికి మద్దతు పలకడం మంచిది కాదని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఏదో సరదాగా ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు కొంపలు ముంచుతోంది. ఎరక్క పోయి ఇరుక్కున్నానని ఆయన ఇబ్బంది పడుతున్నాడట. తన మనసులో మాటను బయటకు చెప్పడం తప్పు లేదు గానీ..భారత్ కు వ్యతిరేకంగా ఆయన తన అభిప్రాయాన్ని చెప్పడమే ఆగ్రహానికి కారణమైంది. ఈ మ్యాచ్ లో గెలిచి భారత్ సాధికారికంగా పైనల్ లో అడుగు పెట్టింది. పాకిస్తాన్ కాచుకో వచ్చామని చెప్పింది. దీంతో ఆదివారం జరిగే పైనల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రజలు
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*