టీడీపీకి అపాయింట్ మెంట్ ఇచ్చిన గవర్నర్



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులకు కొంత కాలంగా అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదు గవర్నర్ నరసింహన్. మియాపూర్ భూ కుంభ కోణం పై సమగ్ర విచారణ జరపాలని టీడీపీ మొదటి నుంచి వాదిస్తోంది. వేల కోట్ల రూపాయల కుంభకోణంలో టీఆర్ఎస్ నేతల పాత్ర ఉందనే అనుమానం వ్యక్తం చేస్తోంది టీడీపీ.అందుకే గవర్నర్ నరసింహన్ ను కలిసి తమ వాదన వినిపించారు టీడీపీ నేతలు. మియాపూర్ కేసును సిఐడి దర్యాప్తు చేయడం వల్ల కేసు నీరుగారిపోతుందని చెప్పారు వాళ్లు. అందుకే సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. తమను కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని టీడీపీ నేతలు గవర్నర్ ను పది రోజులుగా కోరుతున్నారు. బిజీగా ఉన్నానంటూ ఆయన వారికి అనుమతించలేదు. దీంతో గవర్నర్ తీరు పైనా విమర్శలు వెల్లువెత్తాయి. మీడియాలోను గవర్నర్ తీరును తప్పు పట్టారు నేతలు. దీంతో గవర్నర్ తనకు ఎందుకు వచ్చిన చిక్కు అని వెనక్కు తగ్గారు. రండి. కలుద్దామని ఆహ్వానం పంపారు టీ టీడీపీ నేతలకు. ఈ మేరకు వారు గవర్నర్ ను కలిసి కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*