జేసీ అల్లుడు దొరికింది అక్కడే



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పక్కా ఆధారాలతోనే అతన్ని పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.ఇందుకు ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్ నే కారణం. హైదరాబాద్ లో భూ కబ్జా కేసులో అరెస్టు అయిన దీపక్ రెడ్డి ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో పడ్డాడు. తనకు తానే ఆ పత్రాలను సృష్టించడం ఆధారలతో దొరకడంతో ఇక తప్పించుకోలేడంటున్నారు. ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలు అక్రమ కబ్జాలుగా పోలీసులు నిర్దారించారు. అవి తన భూములు కావని…దీపక్ రెడ్డి బుకాయించినా అది వాస్తవం కాదని హైదరాబాద్ పోలీసులు తేల్చారు. ముందుగా ఆయనకు నోటీసులు ఇస్తే తనకు సంబందం లేదని వాదించారు. ముందస్తు బెయిల్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆదారాలతో ఇచ్చేసరికి దిక్కుతోచని స్థితిలో పడ్డారాయన. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు దీపక్‌ రెడ్డి నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌పై అధికారులు నిఘా పెట్టారు. ఎన్నికల సంఘానికి లేఖ రాసి వివరాలుతీసుకున్నారు. ఆ తర్వాత ఏ స్థలాలకు సంబంధించి దీపక్‌రెడ్డి తన సంతకాలు ఫోర్జరీ చేశారో గుర్తించారు. అవన్నీ తన స్థలాలే అని, అనివార్య కారణాల వల్ల కేసులు ఉన్నాయని పిటిషన్‌ నంబర్లతో పాటు దీపక్‌రెడ్డి పేర్కొన్నారు. బోగస్ డాక్యుమెంట్లు పుట్టించి..ఆ స్థలం తనదేనని నమ్మించిన దీపక్ రెడ్డిది ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. అవి తన భూములేనని చెబితే అక్రమాలకు పాల్పడినట్లు లెక్క. కాదని చెబితే…ఎన్నికల సంఘాన్ని తప్పు దోవ పట్టించినట్లు అవుతోంది. ఇలా రెండు రకాలుగా దీపక్ రెడ్డి ఇరుక్కున్నారు.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*