దీపక్ రెడ్డి పై చర్య తీసుకోలేకపోతున్న చంద్రబాబు



Want create site? Find Free WordPress Themes and plugins.
భూ ఆక్రమణలో ఆధారాలతో పోలీసులకు చిక్కాడు టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. పక్కాగా అతన్ని కేసుల్లో ఇరికించింది తెలంగాణ ప్రభుత్వం. తెరవెనుక ఏం జరిగినా దీపక్ రెడ్డి ఇరుక్కున్నాడు. ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్ లోను ఆధారాలతో సహా ఇచ్చాడు. తనకు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని గతంలోనే ప్రకటించిన దీపక్ రెడ్డి చుట్టూ ఇప్పుడు అక్రమాల కథ అల్లుకుంటోంది. ఆయన్ను ఎవరూ కాపాడలేని పరిస్థితికి వచ్చాడు. అందుకే ఆయన పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ టీడీపీ నుంచే వినొస్తోంది. పక్కాగా తప్పుచేసి పోలీసులకు చిక్కిన అతన్ని పార్టీ నుంచి తప్పించాలంటున్నారు. గతంలో వాకాటి నారాయణరెడ్డి బ్యాంకులకు అప్పులు ఎగ్గొడితే పార్టీనుంచి తప్పించారు. ఇప్పుడు దీపక్ రెడ్డిని అలానే సస్పెన్స్ వేటు వేయమంటున్నారు. 
                వాకాటిని పక్కన పెట్టినా పెద్దగా విమర్శలు రాలేదు. కానీ దీపక్ రెడ్డిని తొలగిస్తే జేసీ దివాకర్ రెడ్డి సోదరులతో ఇబ్బంది వస్తుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. తాడిపత్రి, అనంతపురం ప్రాంతాల్లో జేసీ వర్గానికి మంచి పట్టు ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడే దీపక్ రెడ్డి. తన అల్లుడును సస్పెండ్ చేస్తారా అంటూ ఆందోళన చేసే అవకాశముంది. అందుకే ఈ విషయంలో ఆచితూచి అడుగేయాలని సమాచాలోచలు చేస్తున్నారట. ముందుగా జేసీ బ్రదర్స్ ను ఒప్పించి.. ఆ తర్వాతనే నిర్ణయం తీసుకునే దిశగా పావులు కదుపుతున్నారట పార్టీ అధినేత చంద్రబాబు. మరోవైపు తనకు ఐదువేల కోట్ల రూపాయల ఆస్తుల్నట్లు ప్రకటించిన దీపక్ రెడ్డి ఇప్పుడు ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు రాజకీయ ఒత్తిడులు చేయిస్తున్నారని తెలుస్తోంది. అలా చేస్తే అక్రమాలకు తెలంగాణ సర్కారు పచ్చ జెండా ఊపినట్లు అవుతోంది. అందుకే వెనక్కుతగ్గలేక అలాయని చర్యలు తీసుకోలేక తటపటాయిస్తున్నారంటున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*