నిన్నుకోరి మూవీ టీజర్ రిలీజ్



Want create site? Find Free WordPress Themes and plugins.
నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా వస్తున్న చిత్రం ‘నిన్నుకోరి’. ఈ మూవీలో శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఆది పినిశెట్టి, నివేదా థామస్‌ కనిపించే ఈ టీజర్‌లో నాని వాయిస్‌తో బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే ‘ఈ అమ్మాయిలు కూడా అస్సలు అర్థం కారు బాసూ. అన్ని అలవాట్లు వున్నవాళ్ళని ప్రేమిస్తారు.. ఏ అలవాట్లూ లేనివాడ్ని పెళ్ళి చేసుకుంటారు’ అనే డైలాగ్‌ మంచి హైలట్ అని చెబుతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 7న ‘నిన్నుకోరి’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నారు. నాని, నివేథా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పోషిస్తున్నారు. మురళీశర్మ, తనికెళ్ళ భరణి, పృథ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు కోన వెంకట్‌, సంగీతం గోపీసుందర్‌, ఫోటోగ్రఫీ కార్తీక్‌ ఘట్టమనేని, ఆర్ట్‌ చిన్నా, స్టైలింగ్‌ నీరజ కోన, పాటలు రామజోగయ్యశాస్త్రి, శ్రీజో, కో-డైరెక్టర్‌ లక్ష్మణ్‌ ముసులూరి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌ సత్యం గుగ్గిలలు అందిస్తున్నారు.

 

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*