అదంతా ఉత్త‌దే అంటున్న ఉత్త‌మ్‌కుమార్!



Want create site? Find Free WordPress Themes and plugins.

తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి మాంచి జోష్ మీదున్నాడు. త‌మ అధిప‌తి.. రాహుల్‌గాంధీ స‌భ విజ‌యవంతం కావ‌టంతో ఉత్సాహంతో ఉన్న‌ట్టున్నాడు. అన్నీ ఒకే కానీ.. అది మాత్రం అడ‌గొద్దంటూ ష‌ర‌తు పెడుతున్నారు. మీడియా ప్ర‌తినిధులు ఉత్త‌మ్‌తో మాట్లాడితేచాలు.. ఏవైనా అడ‌గండీ ఆ ఒక్క‌టి త‌ప్ప అంటూ..తేల్చిపారేస్తున్నార‌ట‌. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా.. సోనియాగాంధీ ను అమ్మ‌లా ఆరాధించ‌ని.. ప్ర‌జ‌లు.. ముఖ్యంగా ఓట‌ర్లు తెలంగాణ రాష్ట్ర స‌మితి(టీఆర్ ఎస్‌)కు జై కొట్ట‌డాన్ని జీర్ణించుకోలేక‌పోయారు. నిన్న‌టి వ‌ర‌కూ  అధికార పార్టీ ఇక హ‌స్తం ప‌ని అయిపోయిన‌ట్లేనంటూ.. ప్ర‌చారం చేయ‌టంతో నిజ‌మ‌నేభావ‌న‌కు వ‌చ్చారు. ఒకానొక ద‌శ‌లో సీనియ‌ర్ నేత‌లు జానారెడ్డి.. త‌మ పార్టీను బ‌తికించేందుకు బాహుబ‌లి వ‌స్తాడంటూ చెప్ప‌టం అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మైంది. దీన్ని అవ‌కాశం చేసుకుని కాంగ్రెస్ చ‌రిత్ర ముగిసిన‌ట్లేన‌ని.. ఎవ‌రో బ‌య‌టి నుంచి వ‌స్తే త‌ప్ప హ‌స్తం దారిలోకి రాద‌నేది వారే అంగీక‌రించారంటూ గులాబీ నేత‌లు ఎద్దేవా చేశారు. ఇటువంటి స‌మ‌యంలోనే ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి చేప‌ట్టిన స‌ర్వేలో కాంగ్రెస్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారంటూ తేల్చారు. దీన్ని కాస్తా… కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కొట్టిపారేసి తుస్సుమంటూ గాలితీశారు. ఇన్ని ప్ర‌తికూల ప‌రిస్థితులున్నా.. మొన్న సంగారెడ్డిలో జ‌రిగిన స‌భ‌ను జ‌గ్గారెడ్డితో క‌ల‌సి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి విజ‌యవంతం చేశార‌నే ప్ర‌చారం బాగా జ‌రిగింది. దీంతో 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌నే సీఎం అభ్య‌ర్థి అంటూ ఊహాగానాలు  ఊపందుకున్నాయి. దీనిపై ఉత్త‌మ్ మాత్రం.. అదిష్ఠానం ఎవ‌రి పేరు ప్ర‌క‌టిస్తే వారి త‌ర‌పున నిల‌బ‌డ‌తామంటూ స్ప‌ష్టంచేశారు.

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*