డీజేలో అల్లు అర్జున్ పార్ట‌నర్ షిప్‌



Want create site? Find Free WordPress Themes and plugins.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వ‌రుస హిట్‌ల‌తో మంచి ఊపు మీదున్నాడు. క్రేజ్ ఉన్న హీరో కాబ‌ట్టి రెమ్యూన‌రేష‌న్ కూడా కోట్ల‌లో ఉంటుంది. ఇందులో సందేహం లేదు. అయితే అల్లు అర్జున్ తాను న‌టించిన సినిమాల‌కు పారితోషికం తీసుకోకుండా పంపిణీ హ‌క్కులు తీసుకోవాల‌ని భావిస్తున్నాడు. తాజాగా  దువ్వాడ జగన్నాథం సినిమా విషయంలో అల్లు అర్జున్ ఈ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. డీజే టీజర్ ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తోంది. అభిమానుల కోరికకు అనుగుణంగా ఈ సినిమా ఉన్నట్లు నిర్మాణ వర్గాలు భావిస్తున్నాయి. సినిమాలో అల్లు అర్జున్ వేషధారణతో పాటు పాటలు అభిమానులను అలరిస్తున్నాయి. అయితే ఈ సినిమాకు తీసుకోవాల్సిన రెమ్యురేషన్ స్థానంలో సినీ పంపిణీ హక్కులు తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే కృష్ణ, తూర్పుగోదావరి, పచ్ఛిమ గోదావరి జిల్లాల పంపిణీ హక్కులను తీసుకునేందుకు సిద్దం అవుతున్నారు. దాదాపు 15 కోట్ల విలువైన హక్కులను పొందేందుకు అల్లు అర్జున్ సిద్ధమవుతున్నట్లు తెలిసింది
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*