నంద్యాల పై జగన్, చంద్రబాబు వర్గాల రహస్య మంతనాలు…Want create site? Find Free WordPress Themes and plugins.
కర్నూలు జిల్లా నంద్యాల రాజకీయం రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. సిట్టింగ్ సీటు మాదేనని మంత్రి భూమా అఖిల ప్రియ ప్రకటించడంతో శిల్పా వర్గీయులు గోల గోల చేశారు. చంద్రబాబు జోక్యం చేసుకుని వారించడంతో అంతా సైలెంట్ అయ్యారు. ఉప ఎన్నికల్లో రసవత్తరపోరు ఖాయమని భావిస్తున్న వారికి షాక్ కల్గించే న్యూస్. నంద్యాల బరి నుంచి వైసీపీని తప్పించడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోటీకి దూరంగా ఉండేలా జగన్ ను ఒప్పించడానికి టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. అయితే నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ లేకుండా భూమా కుటుంబంలో ఒకరిని ఎమ్మెల్యే చేయడానికి వైసీపీ నాయకులే చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. వినడానికి వింతగా ఉన్నా..ఇది నిజమంటున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పై ఆ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ సీటు తమదంటే తమదని భూమా కుటుంబంతో పాటు శిల్పా బ్రదర్స్,నంద్యాల ఎం.పి ఎస్పీ వై రెడ్డి కుటుంబం పట్టుపడుతున్నాయి. దీనిపైన ఇప్పటికే రెండు సార్లు చంద్రబాబు వద్ద పంచాయతీలు జరిగాయి. అయితే సర్వే ఆధారంగా అభ్యర్థిని నిర్ణయిస్తానని, అప్పటి వరకు వివాదాలకు దిగొద్దని బాబు వారికి తేల్చి చెప్పారు. అయితే ఈ గొడవను సామరస్యంగా పరిష్కరించడానికి కొంత మంది కర్నూలు నాయకులు పావులు కదుపుతున్నారు. బంధుత్వాల ఆధారంగా టీడీపీ,వైసీపీ నాయకులు నంద్యాల ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు  ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం.   నంద్యాల నుంచి భూమా కుటుంబానికి అవకాశం ఇస్తే ఎవరు పోటీ చేయాలనే విషయం పై వారు ఒక నిర్ణయానికి వచ్చారట. మంత్రి అఖిల ప్రియ పెదనాన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి పేరు ఇప్పటికే ఖరారైంది.టీడీపీ కూడా ఆయనకే టిక్కెట్ ఇస్తే పోటీ లేకుండా ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. టీడీపీతో పాటు వైసీపీ నాయకులు ఈ మేరకు రహస్య చర్చలు జరిపారని తెలుస్తోంది. బ్రహ్మనందరెడ్డికి ఉన్న బంధుత్వాలే ఇందుకు కారణమట. బనగానపల్లి నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జీ, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి బ్రహ్మనందరెడ్డి స్వయంగా అల్లుడు. దీంతో ఆయన లోపాయికారీగా ఏకగ్రీవ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఆయన వై.ఎస్ విజయమ్మతో  ఈ విషయం పైనా చర్చించినట్లు సమాచారం. జగన్ తో మాట్లాడి ఏకగ్రీవం అయ్యేలా చూడాలని రామిరెడ్డి ఆమెను కోరాడట. మరి జగన్ ఏం చేస్తాడోనన్న ఉత్కంఠ నెలకుంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*