పాక్ ను దెబ్బతీసిన భారత్



Want create site? Find Free WordPress Themes and plugins.
సమిష్టి కృషితో టీమిండియా విజయభేరి మోగించింది. కోహ్లీసేన ప్రత్యర్థిని కోలుకోని దెబ్బకొట్టింది. ఈ దెబ్బతో పాకిస్తాన్ క్రికెట్ టీమ్ సెమీస్ అవకాశాలు క్లిష్టం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాల్సిన పాక్..ఆ అవకాశం భారత్ కు ఇచ్చింది. అంతే భారత్ వెనక్కు తగ్గలేదు. ఆచి తూచి ఆడిన ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లు భారీ స్కోరుకు బాటలు వేశారు. తొలి పది ఓవర్ల వరకు ఆట నత్తనడకను తలపించింది. వికెట్లను కాపాడుకుంటే చివర్లో చెలరేగ వచ్చు. ముందుగా జాగ్రత్తగా ఆడాలని కోహ్లీచేసిన సూచన వారికి బాగా పనికి వచ్చింది. అంతే ఓపెనర్లు ఇద్దరు అర్థ సెంచరీలతో హోరెత్తించారు. రోహిత్ అయితే సిక్సర్ తోనే అర్థ సెంచరీ చేసి తన సత్తా చాటాడు. ఆటకు రెండు సార్లు వర్షం అడ్డం వచ్చినా పాక్ గెలవక పోయింది. భారత్ 48 ఓవర్లల్లో మూడు వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (68) రోహిత్ శర్మ(91)  కోహ్లీ (81నాటౌట్ ) యువరాజ్  సింగ్ (53) లు అర్థ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఆల్ రౌండ్ ప్రదర్శన చేశారు.  పాక్ ముందు భారీ లక్ష్యం ఉంచారు. చివరి ఓవర్ లో అయితే పాండ్యా వరుసగా మూడు సిక్సర్లుకొట్టగా..అదే ఓవర్ లో కోహ్లీ మరో ఫోర్ కొట్టాడు. భారత్ ఎంతగా చెలరేగిందో ఈ ఓవర్ ను బట్టే అర్థమవుతోంది. కెప్టెన్ కోహ్లీ 68 బంతుల్లో 80 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  48 ఓవర్లల్లో 320 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించాల్సి వచ్చింది పాక్. ఈ దశలో వచ్చిన వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. దీంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో పాక్ విజయ లక్ష్యాన్ని 41 ఓవర్లకు గాను 289 పరుగులుగా నిర్ణయించారు అంపెర్లు. ఆ స్కోరు చేయలేక పాకిస్తాన్ 33.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌట్‌ అయింది. 124 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత బౌలర్లల్లో ఉమేష్ మూడు వికెట్లను తీయగా..పాండ్యా, జడేజాలు చెరో రెండు వికెట్లను తీసి తన వంతుగా పాక్ పతనంలో భాగం పంచుకున్నారు. పాకిస్తాన్ జట్టులో అజహర్ ఒక్కటే అర్థ సెంచరీ చేశాడు. 32 బంతుల్లోనే 53 పరుగులచేసిన  యువరాజ్‌ సింగ్‌ను మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*