ఆందోళనలకు మద్దతునిస్తున్న టీడీపీ ఎంపీ



Want create site? Find Free WordPress Themes and plugins.
స్వపక్షంలో విపక్షనేత చిత్తూరు ఎంపీ శివ ప్రసాద్. టీడీపీ పై ఈ మధ్య కాస్తంత దూకుడుగానే వెళుతున్నారు. ఆ తర్వాత సి.ఎం చంద్రబాబును కలిసి వెనక్కు తగ్గుతున్నారు. దీంతో రాజకీయ లక్షణాలు శివ ప్రసాద్ కు బాగా వచ్చాయంటున్నారు జనాలు. పవర్ ప్లాంట్‌ ఏర్పాటుకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న ప్రజలకు మద్దతు పలికారు ఎంపీ శివప్రసాద్. చిత్తూరు జిల్లాలోని నిండ్ర మండలం కొప్పెడు హరిజనవాడలో ప్లాంట్‌కి వ్యతిరేకంగా రిలే దీక్షలు జరుగుతున్నాయి. అక్కడకు వెళ్లిన ఎంపీ స్థానికులతో మాట్లాడారు. వారికి ఎదురవుతున్న కష్టాల్ని అడిగి తెలుసుకుని మద్దతు పలికారు. పవర్ ప్లాంట్‌కు ఒక చోట అనుమతి పొంది మరొకచోట నిర్మాణం చేస్తున్న విషయంపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు శివప్రసాద్. కొప్పేడులో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. గ్రామంలో తాగునీటి ఇబ్బంది పరిష్కరించేందుకు ఎంపీ ల్యాడ్స్ నుంచి బోర్‌వెల్ తవ్వించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడతానని శివప్రసాద్ హామీ ఇచ్చారు. దళితులను ఆదుకోవడంలో సి.ఎం చంద్రబాబు చొరవ చూపడం లేదని గతంలో నిప్పులు చెరిగిన శివ ప్రసాద్ ఇప్పుడు ఏం చేస్తాడోనని ఆసక్తిగా చూస్తున్నారు జనాలు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*