రాహుల్ కాలుపెడితే కాంగ్రెస్ పతనమేనా…



Want create site? Find Free WordPress Themes and plugins.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలుపెడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ పతనం మొదలవుతుందట. తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్న మాటలివి. గతంలో రాహుల్ అడుగుపెట్టిన చోటల్లా కాంగ్రెస్ ఓడిపోయిన సంగతి చెప్పారాయన. యూపీలో ఎన్నికల ప్రచారం చేసినా ఏమైందో తెలియంది కాదన్నారు. సంగారెడ్డికి వచ్చి సభలో మాట్లాడి పోయారు రాహుల్. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ఎన్ని కబుర్లు చెప్పినా ప్రజలు నమ్మరన్నారు కేటీఆర్.  
                          మరోవైపు రాహుల్ పర్యటనతో కొత్త జోష్ లో ఉంది కాంగ్రెస్. తెలంగాణ కాంగ్రెస్ ను స్పూర్తిగా తీసుకున్న ఏపీ నేతలు.. రాహుల్ తో గుంటూరులో హోదా ఆందోళన చేయించడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు రాహుల్ గుంటూరులో పాల్గొంటున్నారు కాబట్టి అక్కడ కాంగ్రెస్ పతనం ఖాయమట. తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు ఇదే మాట చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పోరాడాల్సిన అవసరమే లేదన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో సరిగా నిబంధలను పొందు పరచక పోవడమే ఇందుకు కారణమంటున్నారు. చేయాల్సిన సమయంలో చేయక.. ఇప్పుడు ఉద్యమం, ఆందోళన అంటూ వస్తే ఊరుకునేదిలేదని చెబుతున్నారు జేసీ దివాకర్ రెడ్డిలాంటి లీడర్లు.  
                         అమేధిలో రాహుల్ పర్యటించడంతో అక్కడ బీజేపీ గెలిచింది. ఈ సారి గుంటూరులోను మిగతా పార్టీలు గెలుస్తాయంటున్నారు. రాహుల్ నా మజాకా. అందుకే రాహుల్ ను మా ప్రాంతానికి తీసుకు రావాలని సెటైర్లు వేస్తున్నారు టీడీపీ నేతలు. రాహుల్ పర్యటనతో తమ మెజార్టీ పెరుగుతుందని నేతలు చెబుతుండటం విశేషం. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*