బొత్స వస్తానంటే టీడీపీ వద్దందట…



Want create site? Find Free WordPress Themes and plugins.
గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆసక్తికర కామెంట్ చేశారు. పిసిసి మాజీ అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ టీడీపీలో చేరేందుకు విస్తృతంగా పావులు కదిపిన సంగతి గుర్తు చేశారు. తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆయన్ను పార్టీలోకి తీసుకోలేదన్నారు. బొత్స అవినీతి, అక్రమాలు చేసి కోట్లు కూడబెట్టారని..అందుకే ఆయన్ను పార్టీలోకి తీసుకోలేదన్నారు. ఆయనే కాదు..అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరనీ టీడీపీ తీసుకోదని ప్రస్తావించారు. టీడీపీ మహానాడు విజయవంతం కావడంతో జీర్ణించుకోలేకనే బొత్స, అంబటి వంటివారు టీడీపీ పై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బొత్స టీడీపీలోకి చేరేందుకు కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు వంటి వారి వద్దకు వెళ్లి మరీ కలిసి పావులు కదిపారనే ప్రచారం అప్పట్లో వచ్చింది. ఆ వాదనకు బలం చేకూరుస్తున్నట్లు ఉన్నాయని యరపతినేని చెప్పిన మాటలు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు బొత్స, ఆయన మేనల్లుడు శ్రీను మీద అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు ఉన్న భూములకు సంబంధించి అనేక కుంభకోణాలు జరిగాయనే ఆరోపణలున్నాయి. తన కూతురుకు కోట్ల రూపాయలు పెట్టి..అధికార దుర్వినియోగం చేసి మరీ బొత్స పెళ్లి చేశారనే విమర్శలొచ్చాయి. టీడీపీ రానివ్వకపోతే బొత్స చివరకు చేసేదేమిలేక జగన్ పార్టీలోకి వెళ్లారని చెబుతున్నారు గురజాల ఎమ్మెల్యే. దీని పై బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇస్తేగానీ వాస్తవం వెలుగులోకి రాదు. తాను టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించలేదని చెప్పేందుకే బొత్స మొగ్గు చూపే అవకాశముంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*