దాసరికి ఘన నివాళులర్పించిన చంద్రబాబు



Want create site? Find Free WordPress Themes and plugins.
దాసరి మరణం చలనచిత్ర పరిశ్రమకే కాదు.. తెలుగు వాళ్లకు తీరని లోటన్నారు ఏపి సి.ఎం చంద్రబాబునాయుడు. చిన్న కుటుంబంలో పాలకొల్లులో పుట్టి ఉన్నతస్థానానికి ఎదిగిన వారే దాసరి నారాయణరావు. సినీ కార్మికుల సంక్షేమ కోసం ఎనలేని కృషి చేసిన వ్యక్తి దాసరి. తాను చెప్పదల్చుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య. దాసరి మరణం చలన చిత్ర పరిశ్రమకేగాక, తెలుగు జాతికి తీరని లోటని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దాసరి భౌతికకాయాన్ని సందర్శించిన చంద్రబాబు ఆయనకు పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. ఒక నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాత, రాజకీయ నాయకుడుగా ప్రత్యేకత సాధించుకున్న వ్యక్తి అని బాబు కొనియాడారు. మోహన్‌బాబు సినిమా యాక్టర్‌గా ఉన్నప్పుడు నుంచి దాసరితో పరిచయం ఉందని గుర్తు చేసుకున్నారు చంద్రబాబు. దాసరి తమ కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉండేవారని, అన్నివిధాల సహకరించేవారని ప్రస్తావించారు చంద్రబాబు. ఒక మహానటుడ్ని, మహానేతని, మహాదర్శకుడిని కోల్పోయామని చంద్రబాబు అన్నారు. దాసరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు చంద్రబాబు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*