చంద్రుల ఇద్దరి మధ్యతిరిగి మాటల తూటాలు…



Want create site? Find Free WordPress Themes and plugins.
కొంత ప్ర‌శాంతంగా ఉన్న చంద్రుల్లో మ‌ళ్లీ క‌ద‌లిక వ‌చ్చింది. తెలంగాణలో జరిగిన రాష్ట్ర టీడీపీ మ‌హానాడులో పాల్గొన్న చంద్ర‌బాబు నాయుడు పార్టే శ్రేణుల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగం కేసీఆర్ లో క‌ద‌లిక తీసుకువ‌చ్చిందట. సి.ఎం చంద్ర‌బాబు నాయుడుకు మరో సి.ఎం కేసీఆర్ కౌంట‌ర్ ఇచ్చారు. దాంతో మ‌ళ్లీ ఇద్ద‌రి నేత‌ల చోటు చేసుకున్న మాట‌ల యుద్దం దేనికి సంకేతం అనే చ‌ర్చ‌కు దారి తీస్తోంది. చాలా కాలంగా నత్తనడకగా సాగుతున్న ఓటుకు నోటు కేసులో మ‌ళ్లీ క‌ద‌లిక‌ రానుందనే వాదన వస్తోంది. సుప్రీం కోర్టులో విచార‌ణ జ‌ర‌ుగుతున్న ఈ కేసులో చంద్ర‌బాబు నాయుడు త‌న ప్ర‌మేయంపై వాదనవినిపించాల్సి ఉంది. వేస‌వి సెల‌వులు కావ‌టంతో ఈ కేసు జూన్‌కి వాయిదా ప‌డింది. ఇటీవ‌ల చంద్ర‌బాబు నాయుడు అమెరికా ప‌ర్య‌ట‌న నుంచి తిరిగి వ‌స్తూ ఢిల్లీలో కొన్ని గంట‌ల పాటు ర‌హ‌స్యంగా వెళ్ల‌టంపై అనేక ర‌కాల వార్త‌లు వెలుగులోకి వ‌చ్చాయి. ఆయ‌న ఈ కేసు విష‌యంపైనే కొందరిని కలిశారనే చర్చ తెరపైకివచ్చింది. బీజేపీ పెద్దలను ఆయన కలిశారని కొందరుచెబితే కాదు..కాదు న్యాయమూర్తులను ఆయన కలిశారని మరికొన్ని కథనాలు వచ్చాయి. ప్రధాని మోదీతో జగన్ భేటీ తర్వాత ఈసంఘటన జరగడంతో సహజంగానే ఆసక్తిని పెంచింది. దీనిపై సోష‌ల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున చ‌ర్చ‌సాగింది. చంద్ర‌బాబు నాయుడు ఎక్క‌డుకు వెళ్లింది. ఎంద‌ుకు చెప్పుకోలేక‌పోతున్నార‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నించారు. కొంద‌రు సెటైర్లు వేశారు. ప్ర‌తిప‌క్షం నిల‌దీసినా కూడా చంద్ర‌బాబు నాయుడు కానీ, ఆయ‌న పార్టీ వ‌ర్గాలు కూడా స‌రైన స‌మాధానం చెప్ప‌లేక‌పోయారు. దాంతో చంద్ర‌బాబు నాయుడు ఈ కేసు ప‌ని మీద ర‌హ‌స్యంగా ప‌ర్య‌టించి ఉంటార‌ని అనుకుంటున్నారు. ఓటుకు నోటు కేసు పైలుకు తిరిగి కదిలిక వస్తే చంద్రబాబుకు కాస్తంత ఇబ్బందేనట. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*