హ‌రీష్ అన్న మాట‌… రాహుల్ వింటాడా!



Want create site? Find Free WordPress Themes and plugins.

వైరిప‌క్షాల‌న్నీ ఏక‌మై.. విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించ‌టం.. అధికార టీఆర్ ఎస్ పార్టీను ఇబ్బంది పెడుతుంద‌నే చెప్పాలి. కానీ.. అధినేత  కేసీఆర్‌.. మాట‌ల మంత్రాన్ని జ‌పిస్తూనే.. గులాబీ శ్రేణులు. కాంగ్రెస్‌, బీజేపీల‌ను ఏకిపారేస్తున్నాయి. జూన్‌లో సంగారెడ్డి లో కాంగ్రెస్ పార్టీ భారీ బ‌హిరంగ స‌భ జ‌రిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణాలో హ‌స్త‌వ్య‌స్త‌మైన పార్టీను బ‌తికించాల‌నే ఉద్దేశంతో ఆ పార్టీ నేత‌లు.. రాహుల్‌ను తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు ఆహ్వానించారు. ప‌నిలో ప‌నిగా.. సోనియాగాంధీ ద‌య‌వ‌ల్ల‌నే తెలంగాణ వ‌చ్చింద‌నే విష‌యాన్ని మ‌రోసారి ప్ర‌చారంగా మార్చాల‌నే ఉద్దేశంతో ఉన్నారు. దీనిపై తెలంగాణ మంత్రి  హ‌రీష్‌రావు.. కాంగ్రెస్ యువ‌రాజు రాహుల్‌గాంధీకు చిన్న సూచ‌న చేశారు. సంగారెడ్డి వ‌స్తే రాహుల్‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లుకుతామ‌ని.. కానీ.. ఇక్క‌డి నేత‌ల మాట‌లు న‌మ్మి.. త‌మ పార్టీపై ఇష్టమొచ్చిన‌ట్లు మాట్లాడితే.. ప‌ర‌వు పోతుందంటూ.. రాహుల్‌కు సూచించాడు. మూడేళ్ల పాలనలో దేశంలోనే  తెలంగాణ నెంబ‌ర్‌వ‌న్ అంటూ పొగిడిన ఆయ‌న‌.. రాహుల్ రైతుల‌తో ముఖాముఖీ అయితే సింగూరు ప్రాజెక్టు కింద పొలం సాగుచేస్తున్న రైతుల‌తో మాట్లాడాలంటూ చెప్పుకొచ్చారు. చెప్ప‌టం బాగానే ఉంది. కానీ.. హ‌రీష్ అన్న మాట‌.. రాహుల్‌కు చేరేదెలా. అన్న‌దే ప్ర‌శ్న‌. స‌ర్లే.. అన్నా.. మీడియాతో చెప్ప‌ిన‌ట్లు.. మా యువ‌రాజుకు కూడా ఫోన్ చేసి చెప్ప‌రాదే అంటూ.. కొందరు హ‌స్తం నేత‌లు.. హ‌రీష్‌రావు కామెంట్స్‌పై ఎద్దేవా చేశార‌ట‌. 

Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*